బీరు సీసాలో కాఫీ.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..?
ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగకూడదు.. లేనిపోని జబ్బులు వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో బీరు సీసాలో కాఫీ సర్వ్ చేస్తున్నాడు.
By News Meter Telugu Published on 27 Jun 2023 8:42 AM GMTబీరు సీసాలో కాఫీ.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..?
ఉదయం.. సాయంత్రం వేళల్లో కాఫీ.. టీ తాగనిదే ఉండలేరు చాలా మంది. ఆఫీసుల్లో ఉన్నా.. ఇళ్లలో ఉన్నా వేడివేడిగా ఒక్క కాఫీ తాగితేనే రిలీఫ్ అవుతారు. ఈ క్రమంలో రోడ్లపై చాలా టీస్టాళ్లు వెలిశాయి. వేటి టేస్ట్ వాటికే ఉంటుంది అది వేరే అనుకోండి. కానీ.. ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగకూడదు.. లేనిపోని జబ్బులు వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో కొత్తగా ఆలోచించాడు. బీరు సీసాలో కాఫీ సర్వ్ చేస్తున్నాడు.
హైదరాబాద్‌లోని ‘తేకా కాఫీ’ అవుట్ లెట్ లో మీకు అలాంటి కాఫీ దొరుకుతుంది. పసుపు, పింక్-థీమ్ స్టాల్ ను ఏర్పాటు చేసింది. గత ఎనిమిది రోజుల్లో ఏకంగా 30 ఫ్రాంచైజీలను తెరిచారు. మాదాపూర్, గచ్చిబౌలిలో ఈ స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయి. 2022లో ‘షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ వన్’లో తేకా కాఫీ గురించి తెలిపారు. అప్పటి నుండి దీనికి మంచి పాపులారిటీ దక్కింది. ఇందులో పెట్టుబడులు పెట్టడానికి షోలో షార్క్ లు ముందుకు రాకపోయినా.. ఇప్పటికి ఆ కంపెనీ దేశవ్యాప్తంగా 120 కియోస్క్‌లను విజయవంతంగా స్థాపించింది. "తేకా కాఫీ' అనే పేరుకు ప్రేరణ పంజాబ్ సంస్కృతి నుండి వచ్చిందని.. థెకాస్ అనే భావన వచ్చేలా.. మద్యపానం అందించే తరహాలో తాము కాఫీని అందించాలని అనుకుంటున్నామని," అని తేకా కాఫీ సహ వ్యవస్థాపకుడు అభిషేక్ ఆచార్య అన్నారు.
అయితే ఇది గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో పుట్టింది. ఆ రాష్ట్రంలో మద్యపానం లేకపోయినా ప్రజలకు ప్రత్యేకమైన, ఎంజాయ్ చేయగలిగే పానీయాన్ని అందించాలని వారు భావించారు. ఎస్ప్రెస్సోస్ ఉపయోగించి తయారు చేసే కాఫీల లాగా కాకుండా.. తేకా కాఫీ కాఫీ చేయడానికి కోల్డ్ బ్రూలను ఉపయోగిస్తారు. ఈ కోల్డ్ బ్రూను 16-36 గంటల పాటు చల్లటి నీటిలో గ్రౌండ్ కాఫీని నానబెట్టడం ద్వారా తయారు చేస్తారు. సృజనాత్మకత, హాస్యం, ప్రత్యేకమైన భారతీయ గుర్తింపుతో కాఫీ పరిశ్రమను మార్చాలనే లక్ష్యంతో, వారు బీర్ బాటిళ్లలో కాఫీని అందించడం ప్రారంభించారు. “నేను ఒక బార్‌లో బీర్‌ను ఆస్వాదిస్తున్నప్పుడు ఈ ఐడియా నాకు తట్టింది. ఆ సమయంలో నేను కోల్డ్ కాఫీలను ఆకర్షణీయంగా, ప్రత్యేకంగా అందించాలనుకుంటున్నాను, ”అని 30 ఏళ్ల అభిషేక్ ఆచార్య చెప్పుకొచ్చారు.
అభిషేక్ ఎప్పుడూ బీర్ ను తాగడం కంటే బీర్ బాటిల్ ను పట్టుకోవడాన్ని ఎక్కువగా ఆస్వాదించాడు. అదే తమ కాఫీని తీసుకొచ్చేందుకు కొత్త ఐడియాను తీసుకొచ్చిందని అన్నారు. కాఫీ చైన్ తేకాలో పలాంగ్ తోడ్, నెక్స్ట్ లెవెల్, కాఫీ కి జవానీ, మింటో రాణి వంటి వెరైటీలు ఉన్నాయి. ఈ పేర్లను తన రోజువారీ జీవితంలో చాలా సార్లు వింటూ ఉంటామని.. అందుకే క్యాచీగా ఉండేలా టైటిల్స్ పెట్టామని తెలిపారు. వారి బెస్ట్ సెల్లర్లలో ఒకటి పలాంగ్ తోడ్ ఒకటి అని తెలిపారు. ఈ కాఫీలు సాధారణంగా రూ. 130 ధరలో ఉంటాయి. షార్క్స్ నుండి తిరస్కరణ ఎదురైనప్పటికీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించాలనే ధ్యేయంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు.