'ఎమ్మెల్యే దానం మా భూమి కబ్జా చేశాడు'.. ప్రజాభవన్‌ ముందు బాధితుల ఆందోళన

ప్రజా భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూమి కబ్జా చేశాడని.. ప్రజాభవన్‌ దగ్గర బాధితులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు.

By అంజి  Published on  2 Jan 2024 7:04 AM GMT
protest, Praja Bhavan, MLA Danam Nagender, Land issue

'ఎమ్మెల్యే దానం మా భూమి కబ్జా చేశాడు'.. ప్రజాభవన్‌ ముందు బాధితుల ఆందోళన

హైదరాబాద్‌: ప్రజా భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూమి కబ్జా చేశాడని.. ప్రజాభవన్‌ దగ్గర బాధితులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు. తమ భూమిని దానం నాగేందర్‌ కబ్జా చేశాడని బాధితులు ఆరోపించారు. దానం నాగేంద్ర అనుచరులు బస్తీ మహిళలని చూడకుండా తమపై విరుచుకుపడ్డారని.. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తాము ఇండ్ల స్థలాలు కొనుక్కున్నామని చెప్పారు. హైకోర్టు నుండి ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా... దానం నాగేందర్‌ తన అనుచరులతో దౌర్జన్యంగా తమపై దాడి చేయించి తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

కొన్ని కోట్ల రూపాయల విలువగల ఈ భూమిని కబ్జా చేసేందుకు దానం నాగేందర్‌ అనుచరులు బస్తీ మహిళలపై దాడికి పాల్పడుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండగా.. దానం నాగేందర్‌ అనుచరుడు నాగరాజు అనే వ్యక్తి ఆందోళన చేస్తున్న బాధితుల వీడియోలు తన ఫోన్లో చిత్రీకరించాడు. అది గమనించిన బాధితులు వెంటనే నాగరాజును పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రజా భవన్ వద్ద ఉన్న డీసీపీ విజయ్ కుమార్ కు బాధితులు.. దానం నాగేందర్‌, అతని అనుచరులు తమ భూమిని కబ్జా చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేశారు.

Next Story