హైదరాబాద్‌: హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌ శ్రీదేవి

Telangana High court Justice sridevi .. తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్‌ గండికోట శ్రీదేవి గురువారం

By సుభాష్  Published on  20 Nov 2020 4:31 AM GMT
హైదరాబాద్‌: హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌ శ్రీదేవి

తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్‌ గండికోట శ్రీదేవి గురువారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. ఎ స్‌. చౌహన్‌ జస్టిస్‌ శ్రీదేవితో ప్రమాణ స్వీకారం చేయించారు. విశాఖకు చెందిన ఆమె రూర్కెలా లా కాలేజీలో 1986లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఒడిశా సబార్డినే కోర్టుతో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు.2005లో ఉత్తరప్రదేశ్‌ ఝూన్సీలో అదనపు జిల్లా జడ్జిగా ఎంపికై 2016లో పదోన్నతి పొందారు. అలాహబాద్‌ హైకోర్టు అదనపు జడ్జిగా 2018లో నియామకమై, 2019 మే 15న తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అదనపు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ శ్రీదేవిని శాశ్వత న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, వివిధ హోదాల్లో పని చేసిన ఆమె.. ఘజియాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహించారు. 2018లో అలహాబాద్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన శ్రీదేవి.. తనకు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని అలహాబాద్‌ హైకోర్టు సీజే ద్వారా సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సుప్రీం కోర్టు కొలీజియం ఆమెను తెలంగాణ హైకోర్టుకు బదిలీ బదిలీ చేయాలని నిర్ణయించగా, ఈ మేరకకు కేంద్రానికి సిఫార్స్‌ చేసింది.

Next Story