అర్థరాత్రి ప‌బ్‌పై దాడి.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ విజేత‌..!

Task Force police raid on TOT pub at Banjara Hills, Rahul sipligunj.హైద‌రాబాద్ న‌గ‌రంలోని బంజారాహిల్స్‌లో ఉన్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 April 2022 3:46 AM GMT
అర్థరాత్రి ప‌బ్‌పై దాడి.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ విజేత‌..!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ర్యాడిస‌న్ బ్లూ హోట‌ల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో పుడింగ్ మింగ్ ప‌బ్ స‌మ‌యానికి మించి న‌డుపుతున్నట్లు గుర్తించారు. వెంట‌నే ప‌బ్ నిర్వాహ‌కుల‌తో పాటు సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. వీరిలో 33 మంది యువ‌తులు ఉన్నారు. ఆదివారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో పోలీసులు ప‌బ్‌పై దాడులు నిర్వ‌హించారు.

అయితే.. త‌మ‌ను ఎందుకు పోలీస్ స్టేష‌న్‌కు తీసుకువ‌చ్చారంటూ యువ‌కులు పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సింగ‌ర్, బిగ్‌బాస్ విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌పాటు మ‌రికొంద‌రు ప్ర‌ముఖుల పిల్ల‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అంద‌రి వ‌ద్ద నుంచి వివ‌రాలు సేక‌రించిన అనంత‌రం వారిని విడిచిపెట్టారు. రైడ్స్‌ అనంతరం పబ్‌ నిర్వాహకులు అభిషేక్‌ ఉప్పల్‌, అనిల్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఫుడింగ్‌ మింగ్‌ పబ్‌ను సీజ్‌ చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు.. పబ్‌లో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారా..? అన్న‌ కోణంలో దర్యాప్తు చేప‌ట్టారు. హోట‌ల్ సీసీ టీవీ పుటేజ్‌ల‌ను ప‌రిశీలిస్తున్నారు.

Next Story