ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
Swatantra Bharata Vajrotsavalu Here are traffic diversions for 22 Aug.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే
By తోట వంశీ కుమార్ Published on 21 Aug 2022 1:27 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే 'స్వతంత్ర భారత వజ్రోత్సవాలు' వైభవోత్సవ కార్యక్రమం దృష్ట్యా ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్‌బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. కావున వాహనదారులు ఈ విషయాన్ని గమనించి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న మార్గాలు
1. చాపల్ రోడ్డు, నాంపల్లి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద దారి మళ్లిస్తారు.
2.గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ నుంచి ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్‌బీఐ వద్ద దారి మళ్లించి, చాపల్ రోడ్డు మీదుగా అనుమతిస్తారు.
3. రవీంద్రభారతి, హిల్ ఫోర్ట్ రోడ్డు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మీదుగా దారి మళ్లింపు.
4.బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం వద్ద కుడివైపునకు అనుమతించకుండా గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ వద్ద కుడివైపు దారిమళ్లించి చాపల్‌రోడ్డు మీదుగా అనుమతిస్తారు.
5.నారాయణగూడ శ్మశాన వాటిక నుంచి బషీర్‌బాగ్ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద దారి మళ్లించి హిమాయత్‌నగర్ వై జంక్షన్ మీదుగా అనుమతిస్తారు.
6. కింగ్‌కోఠి, బొగ్గుల కుంట నుంచి బషీరాబాగ్, భారతీయ విద్యాభవన్ మీదుగా వెళ్లే వాహనాలను కింగ్ కోఠి ఎక్స్‌రోడ్డు వద్ద దారి మళ్లించి తాజ్‌మహల్, ఇడెన్ గార్డెన్ మీదుగా
7.బషీర్‌బాగ్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ వద్ద దారిమళ్లించి లిబర్టీ మీదుగా అనుమతిస్తారు.
8. హిమాయత్‌నగర్ వై-జంక్షన్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వై-జంక్షన్ వద్ద దారి మళ్లించనున్నారు.
ఆర్టీసీ బస్సుల మళ్లింపులు
1. సికింద్రాబాద్ నుండి బషీర్‌బాగ్ మీదుగా కోటి వైపు వెళ్లే RTC బస్సులు లిబర్టీ వద్ద హిమాయత్‌నగర్-నారాయణగూడ-కాచిగూడ-కోటి వైపు మళ్లించబడతాయి.
2. మెహిదీపట్నం మరియు కూకట్‌పల్లి వైపు నుండి రవీంద్ర భారతి మరియు LB స్టేడియం మీదుగా కోటి వైపు వెళ్లే RTC బస్సులు AR పెట్రోల్ పంపు వద్ద నాంపల్లి వైపు మళ్లించబడతాయి.
ఈ జంక్షన్లల్లో రద్దీ అధికంగా ఉండే అవకాశం
AR పెట్రోల్ పంప్, BJR విగ్రహం, బషీర్‌బాగ్, PCR జంక్షన్, రవీంద్ర భారతి, లిబర్టీ, ట్యాంక్ బంక్, ఖైరతాబాద్, లక్డీకపూల్, MJ మార్కెట్, నాంపల్లి, అబిడ్స్, నారాయణగూడ మరియు LB స్టేడియం జంక్షన్ల గుండా ఆగస్టు 22న మధ్యాహ్నాం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరుతున్నారు.
పౌరులందరూ మళ్లింపులు, ట్రాఫిక్ రద్దీ పాయింట్లను గమనించి, వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవాలని అభ్యర్థించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రాఫిక్ మళ్లింపులు/రోడ్ల మూసివేతలను తొలగించడం/తెరుచుకోవడం జరుగుతుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.