సమస్యలన్నింటినీ ప‌రిష్క‌రించుకున్న హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య సమస్యలకు సంబంధించి ప్రధాన స్రవంతి, డిజిటల్ మీడియాలో వ్యాపించే వివిధ నివేదికలపై హెచ్‌సీఏ స్పందించింది.

By Medi Samrat
Published on : 1 April 2025 7:15 PM IST

సమస్యలన్నింటినీ ప‌రిష్క‌రించుకున్న హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య సమస్యలకు సంబంధించి ప్రధాన స్రవంతి, డిజిటల్ మీడియాలో వ్యాపించే వివిధ నివేదికలపై హెచ్‌సీఏ స్పందించింది. ఈ క్ర‌మంలోనే HCA కార్యదర్శి ఆర్. దేవరాజ్ మంగ‌ళ‌వారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో SRH అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో SRH ప్రతినిధులు కిరణ్, శరవణన్, రోహిత్ సురేష్ పాల్గొన్నారు.

చర్చల సందర్భంగా SRH.. SRH-BCCI మధ్య ఉన్న త్రి-పార్టీ ఒప్పందాన్ని ఖచ్చితంగా పాటించాలని, అన్ని విభాగాలలో అందుబాటులో ఉన్న స్టేడియం సామర్థ్యంలో 10% తదనుగుణంగా కేటాయించాలని SRH ప్రతిపాదించింది. HCA, ప్రతి కేటగిరీలో పాస్‌ల కేటాయింపును సంవత్సరాలుగా అనుసరిస్తున్న పద్ధతికి అనుగుణంగా నిర్వహించాలని ప్రతిపాదించింది.

SRH CEO షణ్ముగంతో లోతైన చర్చలు, మరిన్ని టెలిఫోన్ చర్చల తర్వాత ఈ కింది తీర్మానాన్ని అంగీకరించింది..

*HCAకి 3900 కాంప్లిమెంటరీ పాస్‌ల కేటగిరీ కేటాయింపు మారదు. ఇది స్థిరపడిన పద్ధతికి అనుగుణంగా ఉంటుంది..

SRHకి వృత్తిపరమైన రీతిలో పూర్తిగా సహకరిస్తామని HCA హామీ ఇచ్చింది. ఈ సమావేశంతో మా అపరిష్కృత సమస్యలన్నింటినీ మేము పరిష్కరించుకున్నాము.

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రేక్షకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి HCA మరియు SRH స్నేహపూర్వకంగా కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ సంయుక్త ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపాయి.

ఇదిలావుంటే.. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎ్‌సఆర్‌హెచ్‌) యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అందుకు కారకులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వివాదంపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు.

కాంప్లిమెంటరీ పాసుల విషయంలో తమపై హెచ్‌సీఏ ఒత్తిడి తెస్తోందని, వేధింపులకు గురి చేస్తోందని ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం ఆరోపించించింది. హెచ్‌సీఏ తీరు మారకపోతే హైదరాబాద్‌ నుంచి ఐపీఎల్‌ వేదికను మార్చుకుంటామని హెచ్చరించింది. దీంతో ఈ వివాదం ముదిరి.. సీఎం దృష్టికి వెళ్లింది. దీంతో.. ఆయన విచారణకు ఆదేశించారు.

Next Story