సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటి పరిధిలోని ఓ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా కలకలం రేపింది. మార్చి 7, శుక్రవారం నాడు.. తమ గదుల్లో యువతులు స్పై కెమెరాలను గుర్తించారు. ఈ ఘటన తర్వాత హాస్టల్‌లో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఘటన జరిగిన హాస్టల్ సంగారెడ్డిలోని కిష్టారెడ్డిపేటలో ఉంది. స్థానిక నివేదికల ప్రకారం.. హాస్టల్‌లో ఉంటున్న యువతి.. తన గదిలో అడాప్టర్ లాంటి స్పై కెమెరాను గమనించింది.
తనిఖీ చేయగా అందులో ఫుటేజీలను నిల్వ చేయడానికి ఒక ఎస్‌డీ కార్డ్ ఉంది. హాస్టల్ నిర్వాహకుడు మహేశ్వర్ ఫోన్ చార్జర్లలో కెమెరా పెట్టినట్టు గుర్తించిన అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం మేరకు అమీన్‌పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ నుండి అనేక గాడ్జెట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.