స్పుత్నిక్ వ్యాక్సిన్ ఒక్క డోస్ ధర ప్రకటించిన అపోలో గ్రూప్

Sputnik V Covid Vaccine To Be Rolled Out At rs1195 In Apollo Hospitals. స్పుత్నిక్ వీ టీకా ధ‌ర‌ను అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిట‌ల్స్ ప్ర‌క‌టించింది. ఒక డోసు స్పుత్నిక్ వీ టీకాను రూ.1195కు ఇవ్వ‌నున్న‌ట్లు అపోలో సంస్థ తెలిపింది.

By Medi Samrat  Published on  28 May 2021 10:39 AM GMT
SputnikV

స్పుత్నిక్ వీ టీకా ధ‌ర‌ను అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిట‌ల్స్ ప్ర‌క‌టించింది. ఒక డోసు స్పుత్నిక్ వీ టీకాను రూ.1195కు ఇవ్వ‌నున్న‌ట్లు అపోలో సంస్థ తెలిపింది. జూన్ రెండ‌వ వారం నుంచి దేశంలోని అన్ని అపోలో హాస్పిట‌ళ్ల‌లో ఈ టీకాల‌ను ఇవ్వ‌నున్నారు. వ్యాక్సిన్‌ ధర రూ.995 రూపాయలని, అడ్మినిస్ట్రేష‌న్ ఫీజుగా మ‌రో రూ.200 వ‌సూల్ చేస్తామ‌ని అపోలో సంస్థ తెలిపింది.

అపోలో హాస్పిట‌ల్స్ గ్రూపు ఇప్పటి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 80 చోట్ల‌ ప‌ది ల‌క్ష‌ల మందికి టీకాలు ఇచ్చిన‌ట్లు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మ‌న్ శోభ‌నా కామినేని తెలిపారు. ఇక జూన్ నెల‌లో ప్ర‌తి వారానికి ప‌ది ల‌క్ష‌ల మందికి టీకాలు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. ఆ త‌ర్వాత జూలైలో దాన్ని రెండింత‌లు చేస్తామ‌న్నారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లోగా రెండు కోట్ల మందికి టీకాలు ఇస్తామ‌న్నారు.

దేశంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంలో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి లైట్‌ను త్వరలోనే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని రష్యా తయారీ సంస్థ, భారత్‌లోని భాగస్వామ్య కంపెనీలతో సహా నియంత్రణ సంస్థ అధికారులను ఆదేశించింది. వచ్చే రెండు వారాల్లో ఈ టీకా అనుమతుల కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. భారత్ లో వ్యాక్సిన్ల కొరత తక్కువగా ఉన్న సమయంలో స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా వచ్చి చేరింది. దీంతో మరి కొంత మందికి వ్యాక్సిన్ అందించే అవకాశం ఉంది. రాబోయే నెలల్లో వ్యాక్సినేషన్ కూడా వేగవంతం కాబోతోంది. స్పుత్నిక్ వ్యాక్సిన్ ను వినియోగిస్తున్న 60వ దేశంగా భారత్ నిలిచింది.


Next Story
Share it