ప్ర‌యాణీకుల‌కు అల‌ర్ట్‌.. నేడు 34 ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు

South Central Railway cancels 34 MMTS services.ఎంఎంటీఎస్ రైళ్ల‌కు ఆద‌ర‌ణ త‌గ్గుతోందా..? అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 May 2022 4:56 AM GMT
ప్ర‌యాణీకుల‌కు అల‌ర్ట్‌.. నేడు 34 ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు

ఎంఎంటీఎస్ రైళ్ల‌కు ఆద‌ర‌ణ త‌గ్గుతోందా..? అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రైళ్ల‌లో ప్ర‌యాణీకుల ర‌ద్దీ త‌గ్గుతోంది. క‌రోనా ముందుతో పోలిస్తే ఇప్పుడు రైళ్లు బోసిపోతున్నాయి. దీంతో ప‌లు రైళ్ల‌ను అధికారులు ర‌ద్దు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో నేడు (ఆదివారం) 34 ఎంఎంటీఎస్ స‌ర్వీసుల్ని నిలిపివేస్తున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్‌ స్టేషన్ల మధ్య 18 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి 14, సికింద్రాబాద్‌-లింగంపల్లి మధ్య 2 చొప్పున సర్వీసులు రద్దయ్యాయి.

లింగంప‌ల్లి – హైద‌రాబాద్ మ‌ధ్య ర‌ద్దు అయిన రైళ్లు ఇవే

47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139, 47140

హైద‌రాబాద్ – లింగంప‌ల్లి మ‌ధ్య ర‌ద్దు అయిన రైళ్లు ఇవే

47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120

ఫ‌ల‌క్‌నూమా – లింగంప‌ల్లి మ‌ధ్య ర‌ద్దు అయిన రైళ్లు ఇవే

47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170

లింగంప‌ల్లి – ఫ‌ల‌క్‌నూమా మ‌ధ్య ర‌ద్దు అయిన రైళ్లు ఇవే

47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192

సికింద్రాబాద్ – లింగంప‌ల్లి మ‌ధ్య ర‌ద్దు అయిన రైళ్లు ఇవే

47150

లింగంప‌ల్లి – సికింద్రాబాద్ మ‌ధ్య ర‌ద్దు అయిన రైళ్లు ఇవే

47195

ఎంఎంటీఎస్ ర‌ద్దైన మార్గాల్లో సిటీ బ‌స్సులు

ఎంఎంటీఎస్‌ రైళ్లు ర‌ద్దు చేసిన ప్రాంతాల్లో ప్రయాణీకుల కోసం అద‌న‌పు బ‌స్సుల్ని న‌డిపిస్తామ‌ని ఆర్టీసీ గ్రేట‌ర్ హైద‌రాబాద్ జోన్ ఈడీ యాద‌గిరి తెలిపారు. కేశవగిరి నుంచి బోరబండ వరకు 22, సికింద్రాబాద్‌ నుంచి హైటెక్‌సిటీ 54, సికింద్రాబాద్‌ నుంచి బోరబండ 16, చాంద్రాయణగుట్ట నుంచి పటాన్‌చెరు 108, సికింద్రాబాద్‌ నుంచి పటాన్‌చెరు 84వరకు అదనపు బస్సులు నడుస్తాయని చెప్పారు.

Next Story