శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.కోటి విలువైన బంగారం సీజ్
శంషాబాద్ ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రెండ్రోజుల్లో భారీగా బంగారం పట్టుకున్నారు అధికారులు.
By Srikanth Gundamalla Published on 12 July 2023 6:10 PM ISTశంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.కోటి విలువైన బంగారం సీజ్
ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు బంగారం, ఇతర వస్తువులను అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతుంటారు. అక్రమ రవాణా చేసి కస్టమ్స్ ఆఫీసర్స్‌కు దొరికిపోతారు. తరచూ కొత్త ఐడియాలతో బంగారం, గంజాయి, డ్రగ్స్‌ను తరలిస్తుంటారు. తీరా అధికారులకు చిక్కుతారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ ఎత్తున బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు.
శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రెండ్రోజుల్లో భారీగా బంగారం పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. కేవలం నలుగురు ప్రయాణికుల నుంచే రూ.కోటికి పైగా విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. దుబాయ్, దమ్మామ్ విమానం నుంచి నలుగురు ప్రయాణికులు హైదరాబాద్‌కు వచ్చారు. నలుగురు ప్రయాణికులు అధికారుల చేతికి చిక్కకుండా బంగారాన్ని తమ స్టైల్‌లో అక్రమంగా తరలించేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఒకరు బంగారాన్ని పేస్ట్‌గా చేసి ప్యాకెట్లలో నింపగా.. మరొకరు గాజుల రూపంలో, ఇంకొకరు గొలుసుల రూపంలో వివిధ పద్ధతులో అక్రమంగా బంగారం తలించేందుకు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. అయితే.. విమానాశ్రయంలో వీరు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని అధికారులు గమనించారు.
దాంతో.. సదురు ప్రయాణికులను పలిచి కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దాంతో.. వాటి అక్రమ బంగారం తరలింపు గుట్టు బయటపడింది. జూలై 10 నుంచి 12వ తేదీల మధ్య వరుసగా నాలుగు కేసుల్లో 2.1 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. అయితే.. స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం విలువ రూ.1.27 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిందితులను నలుగురినీ అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.