ఇంటికే బూస్టర్ డోస్.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే
Senior citizens with co-morbidities to get Covid-19 booster shot at home.కరోనా వైరస్ ఇప్పట్లో మనల్ని వదిలిపెట్టేలా
By తోట వంశీ కుమార్ Published on 1 Feb 2022 12:18 PM GMTకరోనా వైరస్ ఇప్పట్లో మనల్ని వదిలిపెట్టేలా లేదు. ప్రపంచదేశాలన్నింటిని ఈ మహమ్మారి వణికిస్తోంది. కొత్త కొత్త వేరియంటల్ రూపంలో ప్రజలపై తన పంజా విసురుతోంది. ఈ మహమ్మారిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి మందులు లేవు. అయితే.. వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల మాత్రం శరీరంలో యాంటీ బాడీలు పెరిగి కరోనా నుంచి రక్షించుకోవచ్చు. దీంతో అన్ని దేశాలు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాలను వేగవంతం చేశాయి.
ఇక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను అధిగమించాలంటే బూస్టర్ డోస్ తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశంలో ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు సీనియర్ సిటిజన్లకు బూస్టర్ డోసులు వేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ రెండు డోసుల టీకాలతో పాటు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు. 60 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసులు అందిస్తున్నారు.
అయితే.. 60ఏళ్లు పైబడిన వారు, ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి, అక్కడ క్యూలో నిలుచోని టీకాలు వేసుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. వీరికోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే ఇంటికి వెళ్లి బూస్టర్ డోస్ వేస్తామని తెలిపింది. దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారు 04021111111 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించింది. ఫోన్ చేసి వివరాలు చెబితే ఇంటికి వచ్చి వ్యాక్సిన్ అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.