హైదరాబాద్: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జనవరి 3వ తేదీకి వాయిదా పడింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఏ11 నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న అల్లు అర్జున్.. రెగ్యులర్ బెయిల్ కావాలని కోర్టులో పిటిషన్ వేశారు. చిక్కడపల్లి పోలీసులు కూడా దీనిపై కౌంటర్ దాఖలు చేయడంతో ఇరువురు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు.. జనవరి 3కు తీర్పును వాయిదా వేసింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుండి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 27వ తేదీన రిమాండ్ ముగిసింది. అదే రోజు ఆయన వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. అప్పుడే అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.