పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
RTC Bus rammed into bushes in Rajendranagar.రంగారెడ్డి జిల్లా రాజేంద్రనరగ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.
By తోట వంశీ కుమార్ Published on
31 Dec 2022 7:09 AM GMT

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనరగ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హైదర్ షాకోట వద్ద అదుపు తప్పి పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో బస్సులోని ప్రయాణీకులను బయటకు తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణీకులు ఉన్నారు.
గాయపడిన ప్రయాణీకులను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్త, మితిమీరిన వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పలువురు ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఎదురుగా కారు రావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో బస్సు పొదల్లోకి దూసుకువెళ్లిందని అంటున్నారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story