చట్నీలో వెంట్రుక.. హైదరాబాద్ రెస్టారెంట్ కు రూ.5000 ఫైన్

హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్‌లో ఉన్న ఓ ప్రముఖ సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌ లో చట్నీలో వెంట్రుకలు వచ్చినందుకు రూ.5,000 ఫైన్ విధించింది.

By M.S.R  Published on  13 Jun 2024 6:45 AM GMT
Restaurant, Hyderabad, hair in chutney

చట్నీలో వెంట్రుక.. హైదరాబాద్ రెస్టారెంట్ కు రూ.5 వేల ఫైన్ 

హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్‌లో ఉన్న ఓ ప్రముఖ సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌ లో చట్నీలో వెంట్రుకలు వచ్చినందుకు రూ.5,000 ఫైన్ విధించింది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చిన చట్నీలో వెంట్రుకలు కనిపించాయి. దీంతో అతడు ఈ విషయాన్ని వినియోగదారుల ఫోరమ్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు.

హైదరాబాద్‌లోని వినియోగదారుల హక్కుల కార్యకర్త ఉమేష్ కుమార్ తన కుటుంబంతో కలిసి జూన్ 11, 2024న రెస్టారెంట్‌ను సందర్శించారు. ఎమ్మెల్యే దోసె, స్టీమ్డ్ దోసె, ప్లేటు ఇడ్లీ, నీళ్ల బాటిల్.. వీటికి రూ. 522 బిల్లు అయింది. అతనికి ఇచ్చిన చట్నీలో వెంట్రుకలను గమనించాడు. వెంటనే రెస్టారెంట్ మేనేజర్‌కి తెలియజేశాడు. వెంటనే ఆ చట్నీని మార్చి వేరే చట్నీ అందించారని.. ఇది చాలా దారుణమైన అనుభవమని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అంతేకాకుండా, రెస్టారెంట్‌లో అందిస్తున్న ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్‌ లో టీడీఎస్ స్థాయిలను కూడా ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై స్పందించిన ఏఎంఓహెచ్ కప్రా హెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 674 ప్రకారం హైదరాబాద్‌లోని రెస్టారెంట్‌పై రూ.5,000 జరిమానా విధించారు.

హైదరాబాద్‌లోని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో దాడులు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తోంది.

Next Story