ఇటీవ‌ల కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్రంలో విగ్ర‌హాల ధ్వంసం ఘ‌ట‌న‌లు మ‌రువ‌క ముందే మ‌రో తెలుగు రాష్ట్రం తెలంగాణ‌లో దుర్గామాత విగ్ర‌హం తొల‌గింపు ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది. దుండ‌గ‌లు అమ్మ‌వారి విగ్ర‌హాన్ని ఆల‌యం బ‌య‌ట వ‌దిలివెళ్లారు. వివ‌రాల్లోకి వెళితే.. మూసాపేట‌లో దుర్గామాత ఆల‌యంలో అమ్మ‌వారి విగ్ర‌హాన్ని గుర్తు తెలియ‌ని దుండ‌గులు తొల‌గించారు. అయితే.. అమ్మవారి విగ్ర‌హాన్ని ఆలయం బ‌య‌ట కొంత దూరంలో వ‌దిలి వెళ్లారు. అంతే కాకుండా ఆల‌య స‌మీపంలోని జంట నాగుపాముల విగ్ర‌హాన్ని ధ్వంసం చేశారు. ఉద‌యం వ‌చ్చిన పూజారీ గ‌మ‌నించి విష‌యాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

స‌మాచారం అందుకున్న స్థానిక భాజ‌పా కార్పొరేట‌ర్ మ‌హేంద‌ర్ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. నిందితుల‌ను వెంట‌నే అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. అక్క‌డికి చేరుకున్న పోలీసులు.. ఆల‌యాన్ని ప‌రిశీలిస్తున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story