హ‌లో హైదరాబాద్ బీ అలర్ట్.. మ‌రో మూడు గంట‌ల్లో భారీ వ‌ర్షం

Rain Alert For Hyderabad. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి.

By Medi Samrat  Published on  19 March 2023 12:18 PM GMT
హ‌లో హైదరాబాద్ బీ అలర్ట్.. మ‌రో మూడు గంట‌ల్లో భారీ వ‌ర్షం

Rain Alert For Hyderabad


తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. రాగల మూడు గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రానున్న గంట, రెండు గంటల్లో అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. నగరంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు రోజులు అక్కడక్కడ ఉరిములు మెరుపులతో కూరిన వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మార్చి 19న రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


Next Story
Share it