15 నిమిషాల్లో 17.6 కి.మీ.. గ్రీన్‌ఛాన‌ల్ ద్వారా లైవ్ ఆర్గాన్స్ త‌ర‌లింపు

Rachakonda traffic police arrange a green channel for live organ.హైద‌రాబాద్ న‌గ‌రంలో మంగ‌ళ‌వారం ఉద‌యం బ్రెయిన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jan 2022 6:27 AM GMT
15 నిమిషాల్లో 17.6 కి.మీ.. గ్రీన్‌ఛాన‌ల్ ద్వారా లైవ్ ఆర్గాన్స్ త‌ర‌లింపు

హైద‌రాబాద్ న‌గ‌రంలో మంగ‌ళ‌వారం ఉద‌యం బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తి అవ‌య‌వాల‌ను ఎల్బీన‌గ‌ర్ కామినేని ఆస్ప‌త్రి నుంచి బేగంపేటలోని కిమ్స్ ఆస్ప‌త్రికి గ్రీన్ ఛాన‌ల్ ద్వారా త‌ర‌లించారు. ఎల్బీన‌గ‌ర్ నుంచి బేగంపేట వ‌ర‌కు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు క‌లుగ‌కుండా రాచ‌కొండ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛాన‌ల్‌ను ఏర్పాటు చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తి లైవ్ ఆర్గాన్స్ (గుండె, ఊపిరితిత్తులు) తీసుకుని ఈ ఉద‌యం 8 గంటల 4 నిమిషాలకు కామినేని ఆస్పత్రి నుంచి ప్రారంభమైన అంబులెన్స్ 8 గంటల 19 నిమిషాలకు బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రికి చేరుకుంది. 17.6 కిలో మీట‌ర్ల దూరాన్ని కేవ‌లం 15 నిమిషాల్లో చేరుకుంది. ఓ మనిషి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను వైద్య సిబ్బందితో పాటు ప‌లువురు అభినందిస్తున్నారు.

Next Story