ఖైర‌తాబాద్ సిగ్న‌ల్ వ‌ద్ద పోలీస్ ఎస్కార్ట్ వాహ‌నం ద‌గ్ధ‌మైంది. షార్ట్ స‌ర్క్యూట్‌తో వాహ‌నంలో పెద్ద ఎత్తున మంటలు చెల‌రేగాయి. సిబ్బంది వెంట‌నే గ‌మ‌నించి వాహ‌నం నుంచి కింద‌కి దిగారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డి చేరుకున్నారు. మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. అయితే.. అప్ప‌టికే వాహ‌నం పూర్తిగా ద‌గ్ధ‌మైంది. ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లే స‌మ‌యం కావ‌డంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అనంత‌రం పోలీసులు ట్రాఫిక్ ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story