హైదరాబాద్‌లో ఈ శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా హైదరాబాద్ లో ఈ శుక్రవారం అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ జరగనుంది.

By M.S.R  Published on  13 April 2023 3:30 PM GMT
traffic restrictions, Hyderabad, Ambedkar statue unveiling, CM KCR

హైదరాబాద్‌లో ఈ శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా హైదరాబాద్ లో ఈ శుక్రవారం అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ జరగనుంది. విగ్రహావిష్కరణ అనంతరం ఐమ్యాక్స్‌ థియేటర్‌ వెనుక ప్రాంతంలో బహిరంగ సభను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరుకానున్న తరుణంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్‌, లుంబినీ పార్క్‌ లను ఈ శుక్రవారం మూసేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

- ట్యాంక్‌బండ్‌ నుండి పీవీఎన్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలను సొనబాయ్‌ మజీద్‌ నుంచి రాణిగంజ్‌ వైపు మళ్లిస్తారు.

- రసూల్‌పూర/మినిస్టర్‌ రోడ్డు నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్‌ రొటరీ వైపు వెళ్లే వారిని నల్లగుట్ట జంక్షన్‌ వద్ద రాణిగంజ్‌ వద్ద దారి మళ్లిస్తారు.

- ట్యాంక్‌బండ్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వెళ్లే వాహనాలను ఇక్బాల్‌ మీనర్‌ వైపు మళ్లిస్తారు.

- బూర్గుల రామ కృష్ణ రావు భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌కు వాహనాలను అనుమతించరు. వీరిని తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ వద్ద ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.

- ఖైరతాబాద్‌ గణేష్‌ మార్గం నుంచి ప్రింటింగ్ ప్రెస్‌ జంక్షన్‌ లేదా నెక్లెస్‌ రొటరీకి వాహనాలను అనుమంతించరు. వీరిని రాజ్‌దూత్‌ లేన్‌ వైపు మళ్లిస్తారు.

- ఖైరతాబాద్‌, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వెళ్లే వాహనాలను వీవీ విగ్రహం వద్ద షాదన్‌ నిరంకారి వైపు మళ్లిస్తారు.

- వీవీ విగ్రహాం-నెక్లెస్‌ రొటరీ-ఎన్టీఆర్‌ మార్గ్‌తో పాటు తెలుగు తల్లి జంక్షన్‌ల మధ్య వాహనాలను అనుమతించరు.

Next Story