ప్రియురాలి సంతోషం కోసం.. దొంగలా మారిన హోంగార్డు
దొంగలను పట్టుకోవాల్సిన హోంగార్డు అతనే దొంగలా మారాడు.
By Srikanth Gundamalla Published on 2 July 2024 2:51 AM GMTప్రియురాలి సంతోషం కోసం.. దొంగలా మారిన హోంగార్డు
దొంగలను పట్టుకోవాల్సిన హోంగార్డు అతనే దొంగలా మారాడు. ప్రియురాలి కోసం.. ఆమె సంతోషం కోసం చైన్‌స్నాచింగ్‌లు చేశాడు. ఏకంగా 36 కేసులు నమోదు అయ్యాయి. అయినా అతను మారలేదు. చివరకు కటకటాల పాలయ్యాడు.
బాలానగర్ డీపీసీ సురేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..రాజస్థాన్‌కు చెందిన మహేందర్ సింగ్ సైబరాబాద్ కమిషనరేట్‌లో హోంగార్డుగా పనిచేసేవాడు. వివాహేతర సంబంధం, మద్యం వంటి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. తన ప్రియురాలి కళ్లలో ఆనందం కోసం చైన్ స్నాచర్‌గా మారాడు. ఏకంగా 36 చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనా అతని తీరు మారలేదు. ఇటీవల దొంగతనాలు చేయడంతో బాలానగర్ ఎస్వోటీ, బాచుపల్లి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మహేందర్ సింగ్‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. అంతేకాక మద్యానికి బానిసయ్యాడని చెప్పారు. మద్యం తాగడానికి డబ్బులు సరిపోకపోవడంతో దొంగగా మారాడు. 2012 నుంచి 2015 వరకు బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో అతనిపై 36 స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి.
మహేందర్‌పై పీడీ యాక్ట్ సైతం నమోదు చేశారు పోలీసులు. అయినా తీరు మారలేదు. గత నెల 24న బాచుపల్లిలో వాకింగ్ చేస్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లాడు ఈ క్రమంలోనే వరుసగా కేసులు నమోదు కావడంతో నిందితుడి కోసం గాలింపు చేపట్టి అరెస్ట్ చేశారు. సోమవారం పట్టుబడినట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద రూ.5 లక్షల విలువ చేసే బంగారం, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.