Hyderabad: సమోసా ప్రియులారా తస్మాత్ జాగ్రత్త.. జియాగూడలో కుళ్ళిన పదార్థాలతో తయారీ

హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్‌కు చెందిన H-FAST (హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్), కుల్సుంపురా పోలీసుల సమన్వయంతో జియాగూడలోని...

By -  అంజి
Published on : 21 March 2026 12:20 PM IST

Hyderabad Samosa Raid, Jiyaguda Samosa Unit, Illegal Food Manufacturing, Food Adulteration Hyderabad, H-FAST Raid

Hyderabad: సమోసా ప్రియులారా తస్మాత్ జాగ్రత్త.. జియాగూడలో కుళ్ళిన పదార్థాలతో తయారీ

హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్‌కు చెందిన H-FAST (హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్), కుల్సుంపురా పోలీసుల సమన్వయంతో జియాగూడలోని ఒక అక్రమ ఆహార తయారీ కేంద్రంపై మెరుపు దాడి చేసి, దానిని సీజ్ చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు, 20-03-2026 సాయంత్రం సుమారు 18:00 గంటలకు, టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ నేతృత్వంలోని H-FAST బృందం, కుల్సుంపురా స్థానిక పోలీసులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కలిసి జియాగూడలోని ఎస్.బి.ఏ గార్డెన్ ఎదురుగా ఉన్న ఇంటి నంబర్ 13-4-582/A/B/30 ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో సదరు తయారీ కేంద్రం ఎటువంటి FSSAI లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ లేదా ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు అబ్దుల్ రషీద్ (73 ఏళ్లు) అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, కుళ్ళిపోయిన గుడ్లు, పదేపదే మరిగించిన నూనెను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా సమోసాలను తయారు చేస్తున్నట్లు తేలింది.

సీజ్ చేసిన వస్తువుల వివరాలు (సుమారు విలువ: రూ.5,00,000/-):

- పాడైపోయిన కోడిగుడ్లు: 500

- వాడేసిన వంట నూనె: 5 కిలోలు

- తయారు చేసిన పదార్థాలు: ఎగ్ సమోసాలు (350), స్వీట్ కార్న్ సమోసాలు (600), ఉల్లిపాయ సమోసాలు (1000)

- ముడి పదార్థాలు: మైదా (50 కిలోలు), ఉప్పు (4 బస్తాలు), సమోసా పట్టీలు (2000), అపరిశుభ్రమైన స్వీట్ కార్న్ (10 కిలోలు)

- యంత్రాలు: ఫ్రైయర్, ఉల్లిపాయలు కోసే యంత్రం, వంట పాత్రలు.

అన్ని వస్తువులను సీజ్ చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రజలకు సూచన:

ఆహార కల్తీ, అక్రమ తయారీ కేంద్రాలపై హైదరాబాద్ సిటీ పోలీస్ (H-FAST & టాస్క్ ఫోర్స్) నిరంతరం నిఘా ఉంచుతుంది. ప్రజలు తమ ప్రాంతాల్లో ఇటువంటి అక్రమ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి, ప్రజారోగ్య రక్షణలో భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.

Next Story