పీవీఆర్ సినిమాస్‌, బుక్ మై షో‌కు జ‌రిమానా

Penalty for book my show and PVR Cinemas.ఇంటర్నెట్ హ్యాండిలింగ్ ఛార్జీల పేరుతో ప్రేక్షకులను నుంచి అధనంగా డబ్బులు వసూలు చేసిన ఘ‌ట‌న‌లో బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్ పై జిల్లా వినియోగదారుల ఫోరం ఆగ్ర‌హాం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2021 10:34 AM IST
Penalty for book my show and PVR Cinemas

ఇంటర్నెట్ హ్యాండిలింగ్ ఛార్జీల పేరుతో ప్రేక్షకులను నుంచి అధనంగా డబ్బులు వసూలు చేసిన ఘ‌ట‌న‌లో బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్ పై జిల్లా వినియోగదారుల ఫోరం ఆగ్ర‌హాం వ్య‌క్తం చేసింది. సినిమా టిక్కెట్ ధ‌ర‌పై అద‌నంగా డ‌బ్బులు వ‌సూలు చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ హైద‌రాబాద్‌కు చెందిన సామాజిక కార్య‌కర్త విజ‌య్ గోపాల్ జిల్లా వినియోగ‌దారుల వివాదాల ప‌రిష్కార క‌మిష‌న్‌కు ఫిర్యాడు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కమిషన్ తీర్పును వెలువరించింది.

సికింద్రాబాద్‌కు చెందిన విజయ్ గోపాల్ పంజాగుట్టలోని పీవీఆర్ సినిమాస్‌లో సినిమా చూసేందుకు బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇంటర్నెట్ హ్యాండిలింగ్ ఛార్జీల పేరుతో రూ.41.78తో కలిపి మొత్తం రూ.341.78 బిల్లు అయింది. సాధారణ టికెట్ ధర కంటే సుమారు 18 శాతం అదనంగా డబ్బులు వసూలు చేయడంపై అత‌ను సెంట్ర‌ల్ క‌న్జ్యూమ‌ర్ ఎఫైర్స్ మినిస్ట్రీకి 2019 జ‌న‌వ‌రి 18న ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంత‌రం జిల్లా వినియోగ‌దారుల క‌మిష‌న్‌ను ఆశ్ర‌యించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-3 అధ్యక్షుడు నిర్మ నారాయణ, సభ్యురాలు సి.లక్ష్మిప్రసన్న వివరణ ఇవ్వాలని బుక్ మై షో సంస్థకు తెలిపింది. స్పందించిన బుక్ మై షో సంస్థ విజయ్ గోపాల్ ఫిర్యాదు నిరాధారమని, కేసును కొట్టి వేయాలని తెలిపారు. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-3 వినియోగ‌దారుల వాద‌న‌ల‌తో ఏకీభ‌వించింది.

ఈ మేరకు టికెట్ ధరపై అధనంగా రూ.6 వసూలు చేసుకోమని తీర్పును వెలువరించింది. దీంతోపాటు ఫిర్యాదు దారుడైన విజయ్ గోపాల్‌కు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని, కేసు ఖర్చులకు రూ.1000, మరో రూ.5 వేలు లీగల్ ఎయిడ్ కింద కోర్టుకు చెల్లించాలని బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్‌కు ఆదేశించింది. 45 రోజులలోపు డబ్బులు చెల్లించాలని, లేకుండా తీర్పు వెలువరించిన కాలం నుంచి 18 శాతం వడ్డీ కొనసాగుతుందని హెచ్చరించారు.


Next Story