కరోనా వ్యాక్సిన్ తయారీపై అధ్యయనానికి 60 దేశాల రాయబారులు, హైకమిషన్‌నర్లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. భారత్‌లో టీకా పురోతిని వివరించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పర్యటన ఏర్పాటు చేసింది. వారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శామీర్‌పేట వద్ద గల జినోమ్‌వ్యాలీకి వెళ్లారు. రెండు బృందాలుగా వీరు పర్యటిస్తారు. మొదటి బృందంలోని వారు భారత్ బయోటెక్ లిమిటెడ్‌ను సందర్శిస్తారు.
అక్కడి నుంచి బయోలజికల్-ఇ- సంస్థకు చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలంగాణ టీకాల తయారీ సంస్థల సామర్థ్యం, పనితీరు, జీనోమ్‌వ్యాలీ, ఔషధపై దృశ్యం ప్రదర్శిస్తారు. అనంతరం రాయబారులు, హైకమిషనర్లు బయోలాజికల్-ఇలోని సౌకర్యాలను పరిశీలిస్తారు. అనంతరం అక్కడి శాస్త్రవేత్తలతో భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి ఢిల్లీ బయలుదేరుతారు. పెద్ద సంఖ్యలో విదేశీ రాయబారులు, హైకమిషనర్లు తెలంగాణను సందర్శించడం ఇదే తొలిసారి. వారి పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.