అమ్మకానికి పాత నాణెం.. ఎక్కడో తెలుసా!

Old Currency For Sale in Hyderabad. ఈతరం పిల్లలకు రూపాయి నుంచి తెలుసు,కానీ ఇంతకు ముందు తరంలో చలామణిలో వున్నా పాత నాణెం తెలియదు.వాటిని అమ్ముతున్నారు పాత బస్తి లో.

By Medi Samrat  Published on  4 Jan 2021 6:25 AM GMT
old currency

ఈతరం పిల్లలకు రూపాయి నుంచి తెలుసు,కానీ ఇంతకు ముందు తరంలో చలామణిలో ఉన్న పైసల గురించి పెద్దగా వారికి అవగాహన ఉండదు. అయితే ప్రస్తుతం కొన్ని తరాలకు ముందు చలామణిలో ఉన్న

నాణేలు కనుమరుగై పోవటం వల్ల అవి ఎలా ఉంటాయో కూడా ఈ తరం పిల్లలకు చాలా మందికి తెలియదు. అయితే కొంతమంది ఔత్సాహికులు మాత్రం ఇంతకు ముందు తరాలలో చలామణి అవుతున్న నాణేలను సేకరించడం అలవాటుగా మారి ఉంటుంది. అలాంటి వారు ఇలాంటి నాణేలు ఎక్కడ దొరికిన అక్కడికి వాలి పోయి వాటిని సేకరించి జాగ్రత్తగా భద్రపరుస్తున్నారు.

హైదరాబాద్ పాతనగరంలోని చార్మినార్ సమీపాన అతి పురాతనమైన నాణేలతో పాటు బ్రిటిష్ వారి కాలానికి చెందిన నాణేలతోపాటు ఖులీకుతుబ్‌షా పాలన కాలంలోని తానీషా రాజ్యంలో వినియోగంలో ఉన్న నాణేలు లభిస్తున్నాయి. స్వాతంత్య్ర అనంతరం మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చలామణిలో ఉన్న పైసా, ఐదు పైసలు 10 పైసలు అక్కడ లభిస్తున్నాయని తెలియడంతో ఎంతో మంది ఔత్సాహికులు వాటిని కొనుగోలు చేయడానికి పెద్దఎత్తున వస్తున్నారు.

కేవలం నాణేల సేకరణ పై మక్కువ ఉన్నవారు మాత్రమే కాకుండా చారిత్రక విషయాలను గురించి తెలుసుకోవాలనుకునే వారు కూడా అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకొని నాణేలను కొనుగోలు చేస్తున్నారని అమ్మకాలు సాగించే ఇమ్రాన్ అనే వ్యక్తి తెలిపారు. అంతేకాకుండా ఆ నాణేలు చలామణి కాలాన్ని బట్టి ధరలు ఉంటాయని తెలిపారు. మన దేశానికి చెందిన నాణేలు మాత్రమే కాకుండా, విదేశాలకు చెందిన నాణేలు సైతం అమ్మకాలు సాగిస్తుంటామని, ఒక్కో నాణేన్ని 300 నుంచి పదివేల వరకు అమ్మకాలు సాగుతున్నాయని ఇమ్రాన్ తెలిపారు. కేవలం నాణేలు మాత్రమే కాకుండా కరెన్సీ నోట్లను సైతం చార్మినార్ ప్రాంతంలో అమ్ముతున్నట్లు తెలియజేశారు.


Next Story