ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా.. టీఎస్ఆర్టీసీ లో కొత్త ప‌థ‌కం

Occasion of International Women's Day new scheme in TSRTC.తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2022 11:59 AM GMT
ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా.. టీఎస్ఆర్టీసీ లో కొత్త ప‌థ‌కం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా వీసీ స‌జ్జ‌నార్ బాధ‌త్య‌లు చేప‌ట్టిన త‌రువాత ఆర్టీసీలో ప‌లు కీల‌క సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చే దిశ‌గా దూసుకెలుతున్నారు. ప్ర‌యాణీకుల‌ను ఆర్టీసీకి మ‌రింత చేరువ చేసే దిశ‌గా ప‌లు కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్ర‌మంలోనే మ‌రో కొత్త ప‌థ‌కానికి తీసుకురానున్న‌ట్లు వీసీ స‌జ్జ‌నార్ తెలిపారు.

ప్రపంచ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని స‌జ్జ‌నార్ శ‌నివారం ఉద‌యం ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఎక్క‌డిది ..? క్యాప్ష‌న్ ఇవ్వండి అంటూ ట్వీట్ చేశారు. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ నెటీజ‌న్ ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకించి ఆర్టీసీలో ఉచిత ప్ర‌యాణం లాంటిదేమైనా ప్ర‌క‌టించ‌నున్నారా.? అంటూ అడిగారు. దీనిపై స‌జ్జ‌నార్ స్పందిస్తూ.. ఓ ప‌థ‌కాన్ని రూపొందిస్తున్నాం, త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం అంటూ స‌మాధానం ఇచ్చారు. కాగా.. ఇప్పుడు ఆ కొత్త ప‌థ‌కం ఏమై ఉంటుందా అన్న చ‌ర్చ ప్రారంభమైంది.

కాగా.. గ‌తంలో బాల‌ల దినోత్సవం, కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా పిల్ల‌ల‌కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఉచిత ప్ర‌యాణాన్ని అందించిన సంగ‌తి తెలిసిందే.

Next Story