Hyderabad: జనవరి 1 నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్
హైదరాబాద్‌లోని నాంపల్లి గ్రౌండ్‌లో ప్రతి ఏడాది ఘనంగా నుమాయిష్ ఎగ్జిషన్‌ను నిర్వహిస్తారు.
By Srikanth Gundamalla Published on 30 Dec 2023 5:15 PM ISTHyderabad: జనవరి 1 నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్
హైదరాబాద్‌లోని నాంపల్లి గ్రౌండ్‌లో ప్రతి ఏడాది ఘనంగా నుమాయిష్ ఎగ్జిషన్‌ను నిర్వహిస్తారు. ఈసారి కూడా ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కు ఏర్పాట్లు చేశారు. జనవరి 1న నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ఎగ్జిబిషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. కాగా.. నిర్వాహకులు ఈసారి ఎగ్జిబిషన్ టికెట్‌కు ఎంట్రీ ధరను రూ.40గా నిర్ణయించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగనుంది.
నుమాయిష్ ప్రెసిడెంట్‌గా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబుని నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీధర్‌బాబు.. నుమాయిష్‌కు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి కూడా నుమాయిష్‌కు విజిటర్స్ వస్తారని చెప్పారు. సేవా దృక్పథంతో సొసైటీ సభ్యులు పనిచేస్తున్నారు. ఎంతో మంది ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నారని అన్నారు. నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.
ఎగ్జిబిషన్‌కు నడవేలని వృద్ధులు వస్తే.. వారి కోసం ఉదయం 11 గంటల నుంచి మధ్యామ్నం 3 గంటల వరకు వాహనాలతో సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు. ముఖ్యంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అగ్నిప్రమాదాలు సంభవించకుండా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ఆర్టీసీ సంస్థ కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు మెట్రో రైళ్లను కూడా అర్ధరాత్రి పొడిగించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా మెట్రో రైల్ కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు అధికారులు.