ఎన్టీఆర్ మార్గ్‌లో ఫార్ములా ఈ-రేస్‌.. నాలుగు రోజులు రోడ్డు మూసివేత‌.. ట్రాఫిక్ మ‌ళ్లింపు ఇలా

NTR Gardens road closed for 4 days for race & Formula E trials; check traffic diversions.ఫార్ములా-ఈకార్ రేసింగ్‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Nov 2022 6:05 AM GMT
ఎన్టీఆర్ మార్గ్‌లో ఫార్ములా ఈ-రేస్‌.. నాలుగు రోజులు రోడ్డు మూసివేత‌.. ట్రాఫిక్ మ‌ళ్లింపు ఇలా

ఫార్ములా-ఈకార్ రేసింగ్‌కు హైద‌రాబాద్ న‌గ‌రం సిద్ద‌మైంది. హుస్సేన్ సాగ‌ర్ తీరంలో న‌వంబ‌ర్ 19, 20న తేదీల్లో ఫార్ములా-ఈ రేస్‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ట్ర‌య‌ల్ ర‌న్స్‌, రేసు దృష్ట్యా ఎన్టీఆర్ మార్గ్‌, స‌చివాల‌యం రోడ్ల‌ను న‌వంబ‌ర్ 16 రాత్రి 10 గంట‌ల నుంచి న‌వంబ‌ర్ 20 రాత్రి 10గంట‌ల వ‌ర‌కు మూసివేస్తున్న‌ట్లు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఆ మార్గాల్లో వెళ్లే వాహ‌న‌దారులు, ప్ర‌యాణీకులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని సూచించారు.

ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..

1) VV విగ్రహం (ఖైరతాబాద్) నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వచ్చే ట్రాఫిక్, నెక్లెస్ రోటరీ వైపు అనుమతించబడదు. VV విగ్రహం (ఖైరతాబాద్) వద్ద షాదన్ కళాశాల - రవీంద్ర భారతి వైపు మళ్లించబడుతుంది.

2) బుద్ద‌ భవన్ / నల్లగుట్ట జంక్షన్ నుండి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్, నెక్లెస్ రోటరీ వైపు అనుమతించబడదు. నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్/ట్యాంక్‌బండ్ వైపు మళ్లించబడుతుంది.

3) రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుండి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నెక్లెస్ రోటరీ వైపు అనుమతించరు. నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.

4) ఇక్బాల్ మినార్ జంక్షన్ నుండి తెలుగుతల్లి జంక్షన్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లేందుకు ఉద్దేశించిన ట్రాఫిక్ తెలుగుతల్లి వైపు అనుమతించబడదు. కట్ట మైసమ్మ దేవాలయం/లోయర్ ట్యాంక్ బండ్ వైపు తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఎక్కాలి.

5) ట్యాంక్‌బండ్/తెలుగు తల్లి నుండి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించబడదు. తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్/రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తారు.

6) BRKR భవన్ నుండి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించబడదు. తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్/రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లించబడును.

7) ఇక్బాల్ మినార్ జంక్షన్ నుండి మింట్ కాంపౌండ్ లేన్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించబడదు .ఇక్బాల్ మినార్ జంక్షన్ వద్ద రవీంద్ర భారతి జంక్షన్ వైపు మ‌ళ్లిస్తారు.

8) ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుండి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ లేదా నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించబడదు. బడా గణేష్ వద్ద రాజ్‌దూత్ లేన్ వైపు మళ్లించబడును.

9) ఫార్ములా E-రేసింగ్ కారణంగా ఎన్టీఆర్ గార్డెన్, NTR ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ లు 18-11-2022 నుండి 20-11-2022 వరకు మూసివేయబడతాయి.

ఆర్టీసీ బస్సుల మళ్లింపు:

-అఫ్జల్‌గంజ్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌ బండ్‌ రోడ్డును తప్పించి తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌, కట్ట మైసమ్మ, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, డీబీఆర్‌ మిల్స్‌, కవాడిగూడ మీదుగా వెళ్లాలి.


ట్రాఫిక్ రద్దీ జంక్షన్లు:

నవంబర్ 19, 20 తేదీలలో, ట్రాఫిక్ మళ్లింపుల కారణంగా దిగువ జంక్షన్‌లు రద్దీగా ఉంటాయని, ప్రయాణికులు దిగువ జంక్షన్‌లను నివారించాలని సూచించారు.

-వివి విగ్రహం (ఖైరతాబాద్) జంక్షన్

-పాత సైఫాబాద్ పీఎస్ జంక్షన్

-రవీంద్ర భారతి జంక్షన్

-మింట్ కాంపౌండ్ రోడ్

- తెలుగు తల్లి జంక్షన్

- నెక్లెస్ రోటరీ

-నల్ల గుట్ట జంక్షన్

-కట్ట మైసమ్మ (లోయర్ ట్యాంక్‌బండ్)

-ట్యాంక్ బండ్

Next Story