Hyderabad: నిబంధనలు పాటించని 9 బ్లడ్‌ బ్యాంకులకు నోటీసులు

హైదరాబాద్‌ నగరంలోని పలు బ్లడ్‌ బ్యాంకుల్లో డ్రగ్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  22 Feb 2024 11:45 AM GMT
notice,  9 blood banks,  hyderabad ,

Hyderabad: నిబంధనలు పాటించని 9 బ్లడ్‌ బ్యాంకులకు నోటీసులు 

హైదరాబాద్‌ నగరంలోని పలు బ్లడ్‌ బ్యాంకుల్లో డ్రగ్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మల్‌పేట్‌, చైతన్యపురి, లక్డీకపూల్, హిమాయత్‌నగర్, సికింద్రాబాద్, కోఠి, మెహదీపట్నం, బాలానగర్, ఉప్పల్‌లోని పలు బ్లడ్ బ్యాంకుల్లో తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా నిబంధనలు పాటించని 7 బ్లడ్‌ బ్యాంకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్లేట్‌లెట్స్, ప్లాస్మా నిల్వ, రక్త సేకరణ పరీక్షలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు.

ఫిబ్రవరి 2వ తేదీన మూసాపేటలోని హీమో సర్వీసెస్‌ లాబోరేటరీలో తనిఖీలు నిర్వహించారు డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్ అధికారులు. ఇందులో సామర్థ్యానికి మించి నిల్వలను గుర్తించారు. నిర్వాహకుడు అక్రమంగా ప్లాస్మాను నిల్వ చేసి.. అధిక ధరలకు విక్రియస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు మరో బ్లండ్‌ బ్యాంకులో కూడా అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి రెండింటి లైసెన్సులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తర్వులు కూడా ఇచ్చారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐపీఎం సహా 76 ప్రభుత్వ, ప్రయివేటు, ఎన్జీవో బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయి. వీటి నిర్వాహకులు ప్రముఖుల బర్త్‌డేల పేరుతో ఇతర కార్యక్రమాల ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది ప్రజలు ఇతరుల ప్రాణాలను కాపాడాలన్న ఉద్దేశంతో రక్తదానం చేస్తారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్ చేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగులకు అందజేయాల్సి ఉంటుంది. కాని బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు మాత్రం అక్రమాలకు పాల్పడుతున్నారు. 30 శాతం రక్తాన్ని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే కేర్సర్‌ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అందించాలనే నిబంధన కూడా ఉంది. దీనిని పలు బ్లడ్‌ బ్యాంకుల నిర్వాహకులు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే డ్రగ్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి చర్యలు చేపడుతున్నారు.


Next Story