మత్తుమందు ఎక్కువ తీసుకుని నిమ్స్‌ వైద్యురాలు ఆత్మహత్య

నిమ్స్‌లో వైద్యురాలు మత్తమందు అధిక మోతాదులో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  6 July 2024 6:30 AM GMT
nims hospital, doctor, suicide, hyderabad ,

మత్తుమందు ఎక్కువ తీసుకుని నిమ్స్‌ వైద్యురాలు ఆత్మహత్య 

హైదరాబాద్‌లోని బేగంపేట విషాదం చోటుచేసుకుంది. నిమ్స్‌లో వైద్యురాలు మత్తమందు అధిక మోతాదులో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

డాక్టర్ ప్రాచీకర్‌ (46) నిమ్స్‌ ఆస్పత్రిలో అనస్థీషియా అడిషనల్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బేగంపేటలోని బ్రాహ్మణవాడలో తన ఇంట్లో అనష్టీషియా మత్తు వాయిల్‌ తీసుకున్నారు. ఇక ఆమె స్పృహ కోల్పోయి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. పక్కనే అనస్థీషియా బాటిల్‌ ఉండటంతో ఆందోళన చెందారు. ఎంతకీ లేవకపోవడంతో వైద్యురాలిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. ప్రాచీకర్‌ను పరిశీలించిన నిమ్స్‌ వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. ఆస్పత్రికి తీసుకువచ్చే లోపే ప్రాణాలు కోల్పోయిందన్నారు. అనస్థీషియా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్లే చనిపోయిందని నిమ్స్ వైద్యులు నిర్ధారించారు.

ప్రాచీకర్ చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిమ్స్ వైద్యురాలు ప్రాచీకర్ మృతదేహాన్ని పోలీసులు గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియాల్సి ఉంది.

Next Story