'మా నాన్న నాకు దేవుడు'.. బోరున ఏడ్చేసిన మంచు మనోజ్‌

సినీ నటుడు మోహన్‌ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మోహన్‌ బాబు తనయుడు మంచు మనోజ్‌ కూడా పాల్గొని వారికి మద్ధతు తెలిపారు.

By అంజి  Published on  11 Dec 2024 11:29 AM IST
Manchu Manoj, Mohanbabu, Journalists strike

'మా నాన్న నాకు దేవుడు'.. బోరున ఏడ్చేసిన మంచు మనోజ్‌

సినీ నటుడు మోహన్‌ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో మోహన్‌ బాబు తనయుడు మంచు మనోజ్‌ కూడా పాల్గొని వారికి మద్ధతు తెలిపారు. ఈ క్రమంలోనే కుటుంబంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో మంచు మనోజ్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

'నాన్న తరఫున జర్నలిస్టులకు క్షమాపణ చెబుతున్నా. మీడియాపై దాడి దారుణం. ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. నా కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరం. నా భార్య, కూతురి పేరు లాగుతున్నారు. నేను ఆయనను ఎలాంటి ఆస్తులు అడగలేదు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని బంధువుల కాళ్లు కూడా పట్టుకుంటానని చెప్పా. ఈ రోజు సాయంత్రం అన్నీ చెప్పేస్తా' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

కుటుంబం కోసం ఎంతో కష్టపడి పని చేశానని మనోజ్‌ తెలిపారు. 'మా నాన్న నాకు దేవుడు. ఇవాళ మీరు చూస్తున్న వ్యక్తి కాదు ఆయన. వేరేవాళ్లు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. మా అన్న విష్ణు, వినయ్‌.. నాన్నపై గన్ను పెట్టి కాలుస్తున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా? అది నచ్చక కుట్ర చేస్తున్నారు. నేను, నా భార్య ఎవరి పని వారు చేసుకుంటున్నాం.' అని మనోజ్‌ ఎమోషనల్‌ అయ్యారు.

Next Story