హైదరాబాద్‌లో ఘనంగా మిసెస్ మామ్-2022 గ్రాండ్ ఫినాలే పోటీలు

Mrs Mom-2022 grand finale competition was held in Hyderabad. హైదరాబాద్‌: కడల్స్ మిసెస్ మామ్ 2022 సీజన్ 6 గ్రాండ్ ఫినాలే పోటీలు ఆదివారం నాడు హైటెక్స్‌లో ఘనంగా

By అంజి  Published on  28 Nov 2022 10:47 AM IST
హైదరాబాద్‌లో ఘనంగా మిసెస్ మామ్-2022 గ్రాండ్ ఫినాలే పోటీలు

హైదరాబాద్‌: కడల్స్ మిసెస్ మామ్ 2022 సీజన్ 6 గ్రాండ్ ఫినాలే పోటీలు ఆదివారం నాడు హైటెక్స్‌లో ఘనంగా జరిగాయి. తల్లుల కోసం నిర్వహిస్తున్నా భారతదేశంలోని అతిపెద్ద ఆరోగ్య పోటీ గ్రాండ్ ఫినాలే ఇది. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టీ. హరీష్ రావుతో పాటు ఇతర ప్రత్యేక అతిథులు, జ్యూరీ సభ్యులు సంగీత (వ్యవస్థాపకులు), ఉపేంద్ర ప్రతాప్ సింగ్ (ఎస్‌బీయూ హెడ్, లైఫ్ సెల్) పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు మాతృత్వంలో ఉన్న సవాళ్లు, ఆనందాల గురించి తెలుసుకునేందుకు ఉద్దేశించబడింది.

కడల్స్ మిసెస్ మామ్ 6వ సీజన్ దేశమంతటా రిజిస్టర్ చేసుకున్న 1306 మంది గర్భిణీ స్త్రీలతో ప్రారంభమైంది. వీరిలో 40 మంది ఫైనలిస్టుల గర్భిణీ స్త్రీలు గ్రాండ్ ఫినాలేలో ర్యాంప్ వాక్ చేసి, రుద్రాక్ష, నెమళ్ళు, శివుడు, ప్రసిద్ధ రామప్ప ఆలయ వాస్తుశిల్పం నుండి నృత్య బొమ్మలు వంటి థీమ్ లో అందమైన ప్రసూతి దుస్తులుగా రూపొందించిన చీరలను కట్టుకున్నారు. భారతదేశంలోని నేత కార్మికుల కమ్యూనిటీకి మద్దతు ఇవ్వడానికి డాక్టర్ కె. శిల్పిరెడ్డి చేపట్టిన చొరవ ఇది. ఈ చీరలన్నీ నారాయణపేటలోని నేతలు నేసినవి.

సాధారణ, ఒత్తిడి లేని ప్రసవాన్ని ప్రోత్సహించడమే కడల్స్ మిసెస్ మామ్ మొదలవడానికి ఉద్దేశ్యం. అప్పటి నుండి ఇది ఆత్మవిశ్వాసం గల అందమైన తల్లుల కుటుంబంగా కుటుంబంగా విస్తరించింది. ఈ కార్యక్రమం నార్మల్‌ డెలివరీని ప్రోత్సహించడానికి నిర్వహించారు. దీని కోసం ముందుగా ఏడు రోజుల పాటు మహిళలకు స్థిరమైన, ఆరోగ్యకరమైన జీవనశైలి, నీటి యోగా, లమాజ్, ప్రసవానికి సంబంధించిన విషయాలు, 1000 రోజుల డైట్, అలంకరణ, చర్మ సంరక్షణ, దంత సంరక్షణ, ఒత్తిడి నిర్వహణ, ఆత్మవిశ్వాసం పెంపుదల, వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక స్వస్థత, గర్భధారణలో సంతోషం, నిపుణులు అందించే స్టైల్ కోచింగ్ గురించి అవగాహన కల్పించే మరొక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత 2022 నవంబర్ 27న హైదరాబాద్ లోని హైటెక్స్ లో గ్రాండ్ ఫినాలే జరిగింది.

ప్రీ ప్రెగ్నెన్సీ నుంచి ప్రెగ్నెన్సీ వరకు తల్లి పాలివ్వడం, శిశు సంరక్షణ, వ్యాక్సినేషన్ వరకు తల్లి ప్రయాణం కొనసాగుతుంది. గర్భధారణ ప్రయాణంలో ఎలా తోడుగా ఉండాలో, ఎలా ఆస్వాదించాలో వారి కుటుంబాలకి కడల్స్ మిసెస్ మామ్ అవగాహన కల్పించారు.

Next Story