నేడు హైదరాబాద్‌కు మోదీ.. స్వాగతం పలికేందుకు ఆ ఐదుగురికి మాత్రమే అనుమతి..!

Modi hyderabad visit ... ప్రధాన నరేంద్ర మోదీ శనివారం (నేడు) హైదరాబాద్‌కు రానున్నారు. ఈ మేరకు రెండు రోజుల కిందట మోదీ

By సుభాష్  Published on  28 Nov 2020 2:28 AM GMT
నేడు హైదరాబాద్‌కు మోదీ.. స్వాగతం పలికేందుకు ఆ ఐదుగురికి మాత్రమే అనుమతి..!

ప్రధాన నరేంద్ర మోదీ శనివారం (నేడు) హైదరాబాద్‌కు రానున్నారు. ఈ మేరకు రెండు రోజుల కిందట మోదీ పర్యటన ఖరారైనట్లు ప్రకటించిన ప్రభుత్వ వర్గాలు.. మోదీ ఢిల్లీ నుంచి నేరుగా హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి శామీర్‌పేట సమీపంలోని భారత్‌ బయోటెక్‌ను సదంర్శించనున్నారు. కరోనా నివారణకు సంబంధించి భారత్‌ బయోటెక్‌ సిద్ధం చేస్తున్న 'కోవాగ్జిన్‌' టీకా పురోగతిని పరిశీలిస్తారు. అక్కడి శాస్త్రవేత్తలతో మాట్లాడనున్నారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, దాని పనితీరు గురించి మోదీ తెలుసుకోనున్నాఉ. అనంతరం మోదీ పుణె పర్యటనకు వెళ్లనున్నారు. పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీని సందర్శిస్తారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసిన అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తోంది. భారత్‌లో ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ అనుమతి ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్‌కు వస్తుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

స్వాగతం పలికేందుకు ఆ ఐదుగురికి మాత్రమే అనుమతి

కాగా, మోదీ పర్యటన సందర్భంగా శనివారం హకీంపేట విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఐదుగురు అధికారులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్‌.. సీఎం సోమేష్‌ కుఆర్‌కు శుక్రవారం ఫోన్‌ చేసి చెప్పనట్లు అధికారుల ద్వారా సమాచారం. సీఎస్‌ సోమేష్‌ కుమార్‌,డీజీపీ మహేందర్‌రెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, హకీంపేట ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండెంట్‌ మాత్రమే విమానాశ్రయానికి రావడానికి అనుమతి ఇచ్చినట్లు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రజల తరపున గవర్నర్‌, ముఖ్యమంత్రి, కేంద్ర మంతరులు విమానాశ్రయం వద్ద స్వాగతం పలుకుతారు . ఈ సారి కూడా అలాగే చేయాలని సీఎం కేసీఆర్‌ భావించారు. శనివారం మధ్యాహ్నం హకీం పేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం మోదీ కార్యాలయానికి సమాచారం అందించింది. ఇందకు సమాధానం ప్రధాని కార్యాలయం నుంచి ఓ సమాచారం అందినట్లు తెలుస్తోంది. స్వాగతం పలకడానికి సీఎం రావాల్సిన అవసరం లేదని, ఐదుగురికి మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపింది. అయితే ప్రధాని కార్యాలయం నుంచి ఇలాంటి సందేశాలు ఏనాడు రాలేదని, ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదని సీనియర్‌ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి

భాగ్యనగరానికి మరి కొందరు బీజేపీ అగ్రనేతలు కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ జాతీయ నేతల పర్యటనలు ఖరారయ్యాయి. 27న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాగా,, 28న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌, 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కు రానున్నారు. వీరంతా గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌ షోలో పాల్గొననున్నారు.

Next Story