మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కవిత
MLC Kavitha participates in ‘Bonalu’ festival at Mahakali temple.సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల
By తోట వంశీ కుమార్
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ రోజు(ఆదివారం) ఉదయం 4.05 నిమిషాలకు ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. ఆలయ పూజారులు తొలుత అమ్మవారికి మహామంగళ హారతి ఇచ్చారు. అమ్మవారికి సమర్పించేందుకు బోనాలు ఎత్తుకుని పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు అన్ని జనంతో కిక్కిరిపోతున్నాయి.
మోండా మార్కెట్ డివిజన్‌లోని ఆదయ్య నగర్ లైబ్రరీ నుంచి 2 వేల మంది మహిళలతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ర్యాలీగా బయల్దేరి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు కవితను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Participated in #Bonalu festival celebrations at Mahankali Temple in Secunderabad pic.twitter.com/mO84ZRnm6M
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 17, 2022
అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ఈ ఆలయానికి 250 ఏండ్ల పైబడి చరిత్ర ఉందని, హైదరాబాద్ నగరానికి ఈ ఆలయం ఆశీర్వాదం ఉందన్నారు. విపరీతంగా వానలు కురుస్తోన్న నేపథ్యంలో వానలు తెరిపి ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలల్లో శాంతి పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అమ్మవారి దయ వల్ల ప్రజలందరూ సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని కవిత చెప్పారు