సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి.. ఎమ్మెల్యేకు గాయాలు..!

MLA Venkatesh injured During CM KCR Birthday celebrations. కేసీఆర్ బ‌ర్త్‌డే వేడుక‌ల్లో అప‌శృతి చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2023 1:31 PM IST
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి.. ఎమ్మెల్యేకు గాయాలు..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, భార‌త్ రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్‌) అధినేత కేసీఆర్ నేడు 69వ ప‌డిలోకి అడుగుపెట్టారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తున్నాయి. అయితే.. కాచిగూడలో నిర్వ‌హిస్తున్న కేసీఆర్ బ‌ర్త్‌డే వేడుక‌ల్లో అప‌శృతి చోటు చేసుకుంది. అంబ‌ర్‌పేట్ ఎమ్మెల్యే వెంక‌టేష్‌కు తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది.

కాచిగూడ కార్పొరేట‌ర్ ఏర్పాటు చేసిన వేడుక‌ల్లో ఎమ్మెల్యే వెంకటేష్ పాల్గొన్నారు. కేక్ క‌ట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ స‌మ‌యంలో కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు. నిప్పు ర‌వ్వ‌లు ఎగిసి ప‌డి అక్క‌డ ఏర్పాటు చేసిన గ్యాస్ బెల్లూన్ల‌పై ప‌డ్డాయి. పెద్ద శ‌బ్దంతో బెలూన్లు పేలి పోయాయి. మంట‌లు చెల‌రేగాయి. దీంతో భ‌యాంతో అక్క‌డ ఉన్న వారు ప‌రుగులు తీశారు.

ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే వెంక‌టేష్‌తో పాటు ప‌లువురు కార్య‌క‌ర్త‌లు కింద‌ప‌డిపోయాయి. ఈ ఘ‌ట‌న‌లో ఎమ్మెల్యే, కార్య‌క‌ర్త‌ల‌కు స్వ‌ల్ప‌గాయాలు అయిన‌ట్లు తెలుస్తోంది.

Next Story