హైదరాబాద్‌లోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో బ్లుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని ఉపయోగిస్తే డబ్బులు చెల్లించాలంటూ పోలీసులు రాజాసింగ్‌కు ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని రాజాసింగ్ ఉపయోగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ప్రమాదం ఉందని పోలీసులే బుల్లెట్ ఫ్రూట్ వాహనం ఇచ్చి.. ఇప్పుడు డబ్బులు కట్టాలని చెబుతున్నారని ఆరోపించారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కండిషన్ బాగా లేదని, ఒక వేళ డోర్ లాక్ పడితే మళ్లీ ఓపెన్ కాదని ఆయన అన్నారు.
ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో చాలా సమస్యలున్నాయని, ఈ వాహనాలు వాడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారా..? అని రాజాసింగ్ ప్రశ్నించారు. తన వాహనం ఎప్పుడు పాడువుతుందో చెప్పలేమని అన్నారు. తనకు ఇలాంటి వాహనం ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. తనకు బాగా లేని బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఇప్పుడు లేనిపోనివి చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులు నా విషయంలో ఎప్పుడు ఏదో విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనను ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు.