మహంకాళి అమ్మవారికి బంగారు బోనం.. ప్రత్యేక ఆకర్షణగా మంత్రి తలసాని డ్యాన్స్..వీడియో
Minister Talasani Srinivas Yadav Teenmaar Dance at Mahankali Temple.సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ముఖ ద్వారాలు
By తోట వంశీ కుమార్ Published on
15 July 2022 8:03 AM GMT

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ముఖ ద్వారాలు శుక్రవారం పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి కుటుంబసభ్యులతో కలిసి బంగారు బోనాన్ని సమర్పించారు. ముఖ ద్వారాల ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీన్‌మార్ స్టెప్పులతో అదరగొట్టారు.
మంత్రి డ్యాన్స్ చేయడం అక్కడ ఉన్నవారిలో ఉత్సాహాన్ని నింపింది. ఈ బోనాల పండుగ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలతో మహిళల నృత్యాలు, పోతురాజులు, కొలాటం ప్రదర్శనలు భక్తులను అలరించాయి.
ఈ వేడుకలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్‌లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Next Story