జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయాలతో సుపరిపాలన: మంత్రి కేటీఆర్

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వార్డు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. కాచిగూడలో

By Srikanth Gundamalla  Published on  16 Jun 2023 7:20 AM GMT
Minister KTR, Hyderabad, GHMC, Ward Office

జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయాలతో సుపరిపాలన: మంత్రి కేటీఆర్

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వార్డు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. కాచిగూడలో వార్డు కార్యాలయాన్నిగ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వార్డు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ తన స్వరూపాన్ని మార్చుకోనుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో సరికొత్త పాలన అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వార్డు అధికారితో పాటు మొత్తం వార్డులోని 10 మంది చొప్పున 150 వార్డుల్లో 1500 మంది అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు. దీంతో ప్రజా సమస్యలకు పరిష్కారం వెంటనే దొరుకుతుందని చెప్పారు. అంతేకాదు సమస్యలను ఎంత సమయంలో పరిష్కారం చేయాలనే దానిపై సిటిజన్ చార్టర్‌ను కూడా వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు మంత్రి కేటీఆర్.

రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల జనాభా ఉన్నారు.. ఇందులో కోటి మందికి పైగా జనాభా హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. నగరంలో జనసాంద్రత ఎక్కువ ఉంటుందన్నారు. ఎక్కువ జనాభా ఉన్నందున అందరికీ సేవలు సత్వరం అందేలా సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. అధికారులు కూడా ప్రజలకు మరింత చేరువగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ, ఇతర సిబ్బంది ఉంటారు.. చిన్నచిన్న మున్సిపాలిటీల్లో వార్డుకొక ఆఫీసర్ ఉంటారని చెప్పారు మంత్రి కేటీఆర్. మరి కోటికి పైగా జనాభా ఉన్న జీహెచ్‌ఎంసీలో 35వేల మంది సిబ్బందే ఉన్నారు.. అందుకే వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి వార్డుకు పది మంది సిబ్బంది, అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్ స్థాయి అధికారి ఉంటారని మంత్రి కేటీఆర్ తెలిపారు.

వార్డు కార్యాలయాల ద్వారా సమస్యల పరిష్కారం కోసం సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన బాధ పోతుందని చెప్పారు. అంతేకాక సమస్యల పరిష్కారానికి టైమ్‌లైన్ పెట్టామన్నారు. జవాబు దారితనం, సుపరిపాలన కోసం వార్డు కార్యాలయాలు పనిచేస్తాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే అధికారులు రాజకీయాలకు అతీతంగా.. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని సూచించారు. వార్డు కార్యాలయాలకు ఎవరొచ్చి ఫిర్యాదు చేసినా.. స్వీకరించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నగరవాసులు ప్రతి ఒక్కరూ ఈ వ్యవస్థను వినియోగించుకోవాలని చెప్పారు మంత్రి కేటీఆర్.

Next Story