'ఆరోగ్య చేవెళ్ల' కింద 3 లక్షల మందికి వైద్యం.!

Minister KTR launches ‘Arogya Chevella’ initiative. హైదరాబాద్: మూడు లక్షల మందికి వైద్యం అందించేందుకు చేవెళ్ల ఎంపి జి రంజిత్ రెడ్డి "ఆరోగ్య చేవెళ్ల" కార్యక్రమాన్ని

By అంజి  Published on  19 Sept 2022 9:11 AM IST
ఆరోగ్య చేవెళ్ల కింద 3 లక్షల మందికి వైద్యం.!

హైదరాబాద్: మూడు లక్షల మందికి వైద్యం అందించేందుకు చేవెళ్ల ఎంపి జి రంజిత్ రెడ్డి "ఆరోగ్య చేవెళ్ల" కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద పార్లమెంటరీ నియోజకవర్గంలో సంచార వైద్య క్లినిక్‌ల ద్వారా ప్రజలకు నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ గురించి అవగాహన కల్పించనున్నారు. ఆదివారం చేవెళ్ల ఎంపీ జన్మదినం సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ఈ సేవను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ మొబైల్ మెడికల్ క్లినిక్‌ల్లో సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు రక్తపోటు, మధుమేహం, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వంటి నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCDలు) స్క్రీనింగ్‌తో సహా ఉచిత సేవలను అందించనున్నారు. 'ఆరోగ్య చేవెళ్ల' మొబైల్ మెడికల్ క్లినిక్‌లతో ఎన్‌సీడీలకు వ్యతిరేకంగా ఆరోగ్య అవగాహనను పెంచడం, చేవెళ్ల ప్రజల కోసం లోకల్‌ కమ్యూనిటీ, స్వయం-సహాయక బృందాలు, స్థానిక ఆసుపత్రులతో భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది .

ప్రారంభోత్సవ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో నిర్వహించిన ఆరోగ్య శిబిరాల సందర్భంగా, జనాభాలో కనీసం 25 శాతం మంది ఎన్‌సిడిలతో అధిక ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించామని అన్నారు. అంటు వ్యాధులు, ఎన్‌సిడిల భారం గణనీయంగా ఉందని ఆయన అన్నారు. ''ఆరోగ్య చేవెళ్ల'' కార్యక్రమం కింద, ఎన్‌సిడిలపై, ముఖ్యంగా మధుమేహం, రక్తపోటుపై అవగాహన కల్పించేందుకు నోబుల్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ మోడల్ ప్రారంభించబడిందని అన్నారు.

ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స కోసం ప్రజలను స్థానిక ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలకు అనుసంధానించడంలో ఇది సహాయపడుతుందని ఆయన వివరించారు. 30 నుండి 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు "ఆరోగ్య చేవెళ్ల" కింద ప్రయోజనం పొందవచ్చు.

Next Story