ప్ర‌యాణికుల‌కు విజ్ఞ‌ప్తి : మెట్రో ట్రైన్‌ సమయాల్లో మార్పు

Metro Train Timings Changed Due to Night Curfew. తెలంగాణ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ట్రైన్‌ సమయాల్లో మార్పు.

By Medi Samrat  Published on  20 April 2021 3:53 PM IST
Metro train timings

తెలంగాణ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ట్రైన్‌ సమయాల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. ఈ మేర‌కు రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలునడపనున్నట్లు తెలిపారు. చివరి మెట్రో ట్రైన్‌ స్టేషన్ కు రాత్రి 8.45 నిమిషాలకు చేరుకోనున్నట్లు వెల్లడించారు. ఈ మార్పులు నేటి నుంచి ఈ నెల 30 తేదీ వరకు అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. అయితే.. ఉద‌యం స‌మ‌యాల‌లో ఎటువంటి మార్పులు ఉండ‌వు. య‌‌థావిధిగా మొదటి రైలు ఉదయం 6.30 గంటల నుంచి అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు. ప్రయాణికులు త‌ప్ప‌నిస‌రిగా మాస్కు, శానిటైజర్లు వాడలని మెట్రో అధికారులు సూచించారు. తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనాను నియంత్రించేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. గ‌త కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నేటి నుంచి ఈ నెల 30 వ‌ర‌కు రాష్ట్రంలో రాత్రి క‌ర్ఫ్యూని విధించింది. రాత్రి 9 నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు కర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది. క‌ర్ఫ్యూ నుంచి అత్య‌వ‌స‌ర సేవ‌లకు మిన‌హాయింపు నిచ్చారు. రాత్రి 8 గంట‌ల‌కే కార్యాల‌యాలు, షాపులు, హోట‌ళ్లు మూసివేయాని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. తెలంగాణ‌లో రాత్రి క‌ర్ఫ్యూ, వారంత‌పు లాక్‌డౌన్‌పై 48 గంట‌ల్లో నిర్ణ‌యం తీసుకోవాల‌ని రాష్ట్ర హైకోర్టు సోమ‌వారం ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోక‌పోతే త‌గిన ఆదేశాలు ఇస్తామ‌ని హెచ్చ‌రించింది.




Next Story