పంజాగుట్టలో ఆత్మ‌హ‌త్య‌కు యత్నించిన మ‌తిస్థిమితం లేని వ్య‌క్తి

Mentally Ill man suicide attempt in Punjagutta.ప‌ంజాగుట్ట‌లో మ‌తిస్థిమితం లేని ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌కు యత్నించి హ‌ల్‌చ‌ల్ సృష్టించాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jan 2021 8:48 AM GMT
Mentally Ill man suicide attempt in Punjagutta

ప‌ంజాగుట్ట‌లో మ‌తిస్థిమితం లేని ఓ వ్య‌క్తి హ‌ల్‌చ‌ల్ సృష్టించాడు. నిత్యం ర‌ద్దీగా ఉండే ఫ్లై ఓవ‌ర్ కింద ఓ మాన‌సిక రోగి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. అక్క‌డున్న ట్రాఫిక్ పోలీసు బూత్‌పైకి ఎక్కిన ఆ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరించాడు. ఉరి వేసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. దీంతో కింద ఉన్న పోలీసులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే అంతలో అటుగా బస్సు రావడంతో దానిపై పడిపోయాడు.


అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఆర్టీసీ బ‌స్సుపైకెక్కి ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌లో అత‌డికి స్వ‌ల్ప గాయమైంది. వెంట‌నే అత‌డిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మొత్తానికి అత‌ను స్వల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ‌టంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. మ‌తిస్థిమితం స‌రిగా లేక‌నే ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడ‌ని పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్‌గా మారింది.


Next Story