కాలనీ పార్క్‌లో బ్యాడ్మింటన్ ఆడేవారు.. ఏకంగా టోర్నమెంట్ లో రజత పతకాలు గెలిచేశారు

Meet the 2 senior women who went from playing badminton in colony park to winning silver.సికింద్రాబాద్‌లోని వాయుపురికి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Jan 2023 2:17 AM GMT
కాలనీ పార్క్‌లో బ్యాడ్మింటన్ ఆడేవారు.. ఏకంగా టోర్నమెంట్ లో రజత పతకాలు గెలిచేశారు

సికింద్రాబాద్‌లోని వాయుపురికి చెందిన ఇద్దరు సీనియర్ సిటిజన్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. 71 ఏళ్ల శ్యామోలా ఖన్నా, 72 ఏళ్ల నందినీ నాగరాజన్ గత నాలుగేళ్లుగా తమ కాలనీ పార్కులో బ్యాడ్మింటన్ ఆడుతూ ఉండేవారు. ఇప్పుడు ఏకంగా ఓ టోర్నమెంట్ లో సెమీ ఫైనల్స్‌కు చేరుకుని అందరికీ షాక్ ఇచ్చారు. యోనెక్స్-సన్‌రైజ్ ఆల్‌ ఇండియా మాస్టర్స్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్-2023 సిల్వర్ మెడల్ ను సొంతం చేసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రం లోని ఉదయపూర్‌లో జనవరి 17 నుండి 24 మధ్య ఈ టోర్నమెంట్ జరిగింది.

"ఒకప్పుడు కాలేజీలో బ్యాడ్మింటన్ ఆడుతూ ఉండేదాన్ని. అప్పట్లో నేను నా టీమ్ మేట్ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ ఆడుతూ ఉండేవాళ్ళం. ఇక ఈ మధ్య మా కాలనీలో బ్యాడ్మింటన్ కోర్టు కట్టడంతో తిరిగి ఆడడం మొదలుపెట్టాం. దీంతో తిరిగి మేము బ్యాడ్మింటన్ పోటీలు ఆడడం మొదలుపెట్టాం" అని నందిని నాగరాజన్ చెప్పుకొచ్చారు.

"మా వీధిలో పలు టోర్నమెంట్స్ ఆడుతూ గెలిచిన ప్రకాష్ రామప్ప అనే వ్యక్తి మాకు ఈ టోర్నమెంట్ గురించి చెప్పారు. మమ్మల్ని ప్రోత్సహించి అందులో పాలుపంచుకోవాలని కోరారు. మేము బ్యాడ్మింటన్ ఆడటానికి ఇష్టపడతాము.. రెండు సంవత్సరాలుగా సరదాగా ఆడుతున్నాము" అని నందిని నాగరాజన్ అన్నారు. వారి అనుభవాన్ని గురించి అడిగినప్పుడు, నాగరాజన్ మాట్లాడుతూ, “వివిధ వర్గాల ప్రజలు క్రీడలలో ఒకచోట చేరి, తమ అభిరుచిని నెరవేర్చుకుంటారు. ఆటలను ఆస్వాదించడానికి ఇలా చేస్తున్న మాలాంటి వ్యక్తులను చాలా మందిని మేము కలుసుకున్నాము. క్రమశిక్షణ, నిబద్ధత అన్నీ అందులో భాగం. " అని అన్నారు. శ్యామోలా ఖన్నా మాట్లాడుతూ "మేము ప్రస్తుతం లైమ్‌లైట్‌లో ఉన్నాము. ఇది వింతగా అనిపించింది. మేము మా మొదటి మ్యాచ్ ఆడేందుకు అక్కడికి వెళ్ళాం.. నందిని పూర్తి ట్రాక్ ప్యాంట్‌లో ఆడకూడదని రిఫరీకి చెప్పారు. దీనికి నందిని తన ప్యాంట్‌ను మోకాళ్లపైకి చుట్టుకుంది. దీనితో నేను చాలా నవ్వుకున్నాను.. ఇక రిఫరీకి చెప్పడానికి ఏమీ లేదు, ” ఆమె చెప్పింది.


గెలిచిన తర్వాత వారు చేసిన మొదటి పని ఏమిటని అడగ్గా.. “క్లబ్ శాండ్‌విచ్, వాడిలాల్ మట్కా కుల్ఫీ తిన్నాం. మేము గత కొన్ని రోజులుగా డైట్ పాటించడం, ఖిచడీ తినడం వల్ల అలసిపోయాము. దీంతో మేము వాటిని తినాలని అనుకున్నాం. అనుకున్నది చేశాం" అని చెప్పుకొచ్చారు ఇద్దరూ. శ్యామోలా ఖన్నా సింగిల్స్ సెమీ-ఫైనల్‌కు చేరుకుని కాంస్యం గెలుచుకోగా, 70 ఏళ్లు పైబడిన విభాగంలో వీరిద్దరూ ఫైనల్స్‌కు చేరుకుని రజతం గెలుచుకున్నారు.

అన్ని వయసుల వారు బ్యాడ్మింటన్ ఆటను ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితమైన శారీరక శ్రమను కోరుకునే అద్భుతమైన గేమ్, ఇది మీరు ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. చాలా ఆనందదాయకంగా ఉంటుంది. శరీరం, మనస్సు రెండింటికీ వ్యాయామం అవుతుంది. ఒక గంట స్పోర్ట్ ఆడటం వల్ల దాదాపు 480 కేలరీలు బర్న్ అవుతాయి.

Next Story