కొత్త కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేసి 30 వేల నగదు తీసుకుంటుండగా మణికొండ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) మేనేజర్ స్ఫూర్తి రెడ్డితోపాటు మరో సోర్సింగ్ ఉద్యోగిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మంగళవారం మణికొండలోని డివిజన్-18 మర్రిచెట్టు జంక్షన్ మేనేజర్ స్పూర్తిరెడ్డి 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ గౌడ్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
నెకనంపూర్ వెంకటేశ్వర కాలనీ గీతుస్ బృందావనం ప్రాంతానికి చెందిన బొమ్ము ఉపేంద్ర నాథ్ రెడ్డి కొత్తగా కట్టుకున్న రెండు ఇళ్ళకు కనెక్షన్ కోసం అధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో స్ఫూర్తి రెడ్డి తన అవుట్సోర్సింగ్ సిబ్బందికి డబ్బులు ఇవ్వాలని సూచించారు. ఈ విధంగా లంచం తీసుకుంటున్న డబ్బును ఏ2 నిందితుడు నవీన్ రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి ఇక్కడి నాంపల్లిలోని ఎస్పీ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉందని అధికారులు చెప్పారు.