మెట్రో స్టేషన్ పై నుంచి దూకిన వ్యక్తి మృతి
Man jumps from Dilsukhnagar metro station.నిన్న వ్యక్తి మెట్రోస్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా
By తోట వంశీ కుమార్ Published on
1 Oct 2021 3:38 AM GMT

నిన్న వ్యక్తి మెట్రోస్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. ఈ ఘటన మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చత్తీస్‌ఘడ్, కువకొండ, పుల్‌పహడ్, దంతేవాడకు చెందిన భీమా(45) దినసరి కూలీ. ఇతను పుట్‌పాత్‌పై నివాసం ఉంటాడు. గురువారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్ వైపు నుంచి మెట్రో స్టేషన్ మొదటి ఫ్లోర్ ఎక్కాడు.
అక్కడి నుంచి కిందకు దూకేశాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే అతడిని చికిత్సనిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతడి తల, ఎడమ చేతికి తీవ్రగాయాలయ్యాయి. అతడు మద్యం మత్తులో కిందకు దూకినట్లుగా తెలుస్తోంది. అయితే.. అతడి పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం ఉస్మానియాలో మృతి చెందాడు. కాగా.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడు ప్రమాదవశాత్తు పడ్డాడా..? లేదా ఆత్మహత్యకు యత్నించాడా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.
Next Story