Hyderabad: వ్యక్తి లోపల ఉండగానే ఇల్లు కూల్చివేత, మృతి
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 12:42 PM ISTHyderabad: వ్యక్తి లోపల ఉండగానే ఇల్లు కూల్చివేత, మృతి
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. పాత భవనం కూల్చివేత పనులు జరిగాయి. అయితే.. అనుకోకుండా ఆ ఇంట్లో అద్దెకు ఉంటోన్న వ్యక్తి ఉండిపోయాడు. అతన్ని చూసుకోలేదు. కూల్చివేత జరిపారు. దాంతో.. ఇళ్లు కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న సదురు వ్యక్తి ప్రాణాలు కెఓల్పోయాడు.
ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేటలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తన పాత ఇంటిని కూల్చివేయాలని అనుకున్నాడు. దాంతో.. ఇదే విషాయన్ని ఇంట్లో అద్దెకు ఉంటోన్న అందరికీ చెప్పాడు. బుధవారం కూల్చేవేత పనులను మొదలుపెట్టారు. దానికి ముందు రోజే ఇంట్లో రెంట్‌కు ఉంటున్నవారంతా ఖాళీ చేశారు. బుధవారం ఉదయం పాక్షికంగా పనులు చేశారు. ఇక భోజన విరామం తర్వాత పూర్తిగా కూల్చేశారు.
అయితే.. ఇదే ఇంట్లో స్వామిరెడ్డి అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. బుధవారం మద్యం మత్తులో ఖాళీ చేయించిన ఇంటికి వచ్చి లోపల పడుకున్నాడు. ఇక స్వామిరెడ్డి ఇంట్లో పడుకున్న విషయం గమనించని యజమాని, ఇల్లు కూల్చేస్తున్న సిబ్బంది పనులు కొనసాగించారు. ఒక్కసారిగా ఇల్లు కూలిపోవడంతో అతను శిథిలాల కింద చిక్కుకున్నాడు. తీవ్రగాయాలపాలై అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ విషయం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి వెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.