Hyderabad: కుర్చీతాతకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు

కుర్చీని మడతపెట్టి అనే పదంతో ఫేమస్‌ అయ్యాడు ఓ తాత. ఆ తర్వాత ఆయన్ని కుర్చీ తాత అని పిలవడం మొదలుపెట్టారు.

By Srikanth Gundamalla  Published on  27 Jan 2024 1:48 AM GMT
madhura nagar, police counseling, kurchi thatha, hyderabad,

 Hyderabad: కుర్చీతాతకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు 

సోషల్‌ మీడియా కాలం నడుస్తోంది. సోషల్‌ మీడియాలో ఒక్క పోస్టు పెడితే చాలు.. ప్రపంచానికి కనెక్ట్‌ అయిపోతుంది. కొంచె వెరైటీ కంటెంట్‌తో చాలా మందిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను వినియోగించుకునే చాలా మంది క్రేజ్‌ సంపాదించుకుంటున్నారు. మరికొందరు దీనిద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కుర్చీని మడతపెట్టి అనే పదంతో ఫేమస్‌ అయ్యాడు ఓ తాత. ఆ తర్వాత ఆయన్ని కుర్చీ తాత అని పిలవడం మొదలుపెట్టారు. అతని డైలాగ్‌ ఇటీవల వచ్చిన మహేశ్‌బాబు గుంటూరు కారం సినిమాలోని ఓ పాటలో కూడా వినిపించింది.

అయితే.. ఆ కుర్చీ తాతను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. కుర్చీని మడతపెట్టి.. అనే ఒక్క పదం సోషల్‌ మీడియాను కొద్ది రోజులు ఊపేసింది. ఆ తర్వాత అతనికి సంబంధించిన మరిన్ని వీడియోలు కూడా నెట్టింట హల్‌ చల్‌ చేశాయి. కాగా.. కుర్చీతాత అలియా కాలా పాషాను యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్‌ పార్క్‌ వద్ద మధురానగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కుర్చీతాతను ఎందుకు అదుపులోకి తీసుకున్నారనేదానిపై క్లారిటీ ఇచ్చారు. కుర్చీతాత అలియాస్ కాలా పాషా సోషల్ మీడియాలో పరుష పదజాలంతో దూషిస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నాడంటూ యాదగిరి నగర్‌లో నివాసముందే వైజాగ్ సత్య అనే యూట్యూబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దాంతో.. కాలా పాషాను కృష్ణకాంత్ పార్క్‌ దగ్గర అదుపులోకి తీసుకున్నామని చెప్పారు పోలీసులు. ఆ తర్వాత మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక కాలా పాషా మద్యం మత్తులో అలా మాట్లాడానని.. తన తప్పుని ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. దాంతో.. కేసు రాజీ కుదిర్చినట్లు మధురానగర్‌ ఎస్ఐ వెల్లడించారు.

Next Story