త్వరలోనే హైదరాబాద్‌లో మ‌రో ఉపఎన్నిక..

Lingojiguda Division Bypoll. లింగోజిగూడ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించిన ఆకుల రమేష్‌గౌడ్‌ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో లింగోజిగూడ డివిజన్‌లో ఎన్నికల నిర్వహణకు కసరత్తు

By Medi Samrat  Published on  9 April 2021 6:59 AM GMT
Hyderabad bypoll

డిసెంబర్‌లో గ్రేటర్‌ ఎన్నికలు జరిగిన సంగ‌తి తెలిసిందే. ఆ ఎన్నిక‌ల‌లో లింగోజిగూడ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించిన ఆకుల రమేష్‌గౌడ్‌ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో లింగోజిగూడ డివిజన్‌లో ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. ఉప ఎన్నిక నిర్వహణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపింది.

డివిజన్‌ ఓటర్ల జాబితా రూపకల్పనకు నోటిఫికేషన్‌ జారీకి, రిటర్నింగ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ల నియామకం కోసం పలువురి పేర్లతో ఫైల్‌ పంపారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా మారేడ్‌పల్లి తహసీల్దార్‌ సునీల్‌ నతానీ, ఏఆర్‌ఓగా ఎన్‌. మాధవరెడ్డి, రిజర్వ్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ శోభారాణి, రిజర్వ్‌ అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఎల్‌. శారదమ్మల పేర్లను ఎన్నికల సంఘానికి ప్రతిపాదించారు.


Next Story