Hyderabad: తొలిసారిగా మెట్రో స్టేషన్‌లో ఆరోగ్య కేంద్రాలు

దేశంలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్ మెట్రో స్టేషన్‌ లో ఆరోగ్య సేవలు అందుబాటులో వచ్చాయి.

By Srikanth Gundamalla  Published on  15 Sep 2024 3:30 PM GMT
Hyderabad: తొలిసారిగా మెట్రో స్టేషన్‌లో ఆరోగ్య కేంద్రాలు

దేశంలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్ మెట్రో స్టేషన్స్ లో ఆరోగ్య సేవలు అందుబాటులో వచ్చాయి. మిట్టా ఎక్స్ లెన్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్. బి. నగర్ మెట్రో స్టేషన్ లో పాలీ హెల్త్ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్య అతిధిగా మెట్రో రైలు లో ప్రయాణించి విచ్చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లాంఛనంగా ప్రారంభించారు. మెట్రో ప్రయాణీకులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ వైద్య సేవలను వినియోగించుకోవచ్చని ఆమె అన్నారు. మెట్రో స్టేషన్లలో ఆరోగ్య కేంద్రాలు అందుబాటులోకి రావడం సంతోషం అలాగే గర్వకారణం అని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.

మొదటిసారిగా హెల్త్ ఎటిఎం కూడా అందుబాటులోకి వచ్చిందని గద్వాల విజయలక్ష్మి చెప్పారు. రక్త పరీక్షల డయాగ్నస్టిక్ సౌకర్యం, మెడికల్ షాప్, వైద్య నిపుణులు, ఫిజియోథెరపి, టెలి మెడిసిన్, డెంటల్ కేర్ ఇలా అన్నీ మెట్రో స్టేషన్ లో ఆధునిక కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రావడం దేశంలోనే రికార్డు అని గద్వాల్ విజయలక్ష్మి వివరించారు. ఇబ్రహీంపట్నం పట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. లక్షలాది మంది ప్రయాణించే మెట్రో ట్రైన్స్ లో ఎలాంటి అనారోగ్యానికి గురైనా వెంటనే ఎమర్జన్సీ క్లినిక్స్ స్టేషన్లలో అందుబాటులోకి తీసుకు రావడం గొప్ప విషయమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముందు చూపు ఆదర్శనీయం అన్నారు. మిట్టా ఎక్స్ లెన్స్ చైర్మన్ డా. మిట్టా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ఎల్. బి. నగర్ లో తొలి క్లినిక్ ప్రారంభించామని, త్వరలో మియాపూర్, రాయదుర్గం మెట్రో స్టేషన్స్ లో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా వంద మెట్రో కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ఎనీమియా ముక్త భారత్ పిలుపులో భాగంగా తాము ఉచితంగా హిమోగ్లోబిన్ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే విజన్ చెక్, ఆడియోమెట్రి లాంటి 21 టెస్టులు ఉచితంగా చేయనున్నట్లు మిట్టా శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

Next Story