కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్ర‌మాదం

Fire Accident happened in Kukatpally, Hyderabad. కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. స్థానిక‌ రామాలయం రోడ్డులోని టీవీ రిపేరింగ్‌ సెంటర్‌లో.

By Medi Samrat  Published on  5 Jan 2021 11:40 AM GMT
Fire Accident

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. స్థానిక‌ రామాలయం రోడ్డులోని టీవీ రిపేరింగ్‌ సెంటర్‌లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాపులో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. షార్ట్‌ సర్కూట్‌ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది.

స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్ని ప్రమాదంతో మంటలు చెలరేగడంతో పక్కనే మెడికల్ షాపులతో పాటు పలు షాపింగ్ సముదాయాలకు మంటలు వ్యాపించకుండా పోలీసులు ముందస్తుగా వాటిని మూసివేయించారు. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.


Next Story