Kokapet : రికార్డు ధర పలికిన భూమి.. ఎకరం రూ. 137.25 కోట్లు

రంగారెడ్డి జిల్లా కోకాపేట లోని నియో పోలీసు లే ఔట్‌లోని రెండు ప్లాట్లకు ప్రభుత్వం సోమవారం ఈ-వేలం నిర్వహించింది.

By -  Medi Samrat
Published on : 24 Nov 2025 7:30 PM IST

Kokapet : రికార్డు ధర పలికిన భూమి.. ఎకరం రూ. 137.25 కోట్లు

రంగారెడ్డి జిల్లా కోకాపేట లోని నియో పోలీసు లే ఔట్‌లోని రెండు ప్లాట్లకు ప్రభుత్వం సోమవారం ఈ-వేలం నిర్వహించింది. ఈ-వేలంలో ప్లాట్ నెంబర్ 17, 18కి రికార్డు ధర పలికింది. ఎకరం ధర 137.25 కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్17లో 4.59 ఎకరాలు ఉండగా.. ఈ వేలంలో ఎకరానికి రూ.136.50 కోట్ల ధర పలికింది. ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలు ఉన్నాయి. ఈ వేలంలో ఎకరానికి రూ.137.25 కోట్ల ధర వచ్చింది. ఈరోజు నిర్వహించిన వేలంలో 9.90 ఎకరాలకు 1,355.33 కోట్లు HMDA కు దక్కాయి.

Next Story