రేపు సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..?
KCR Public Meeting in Hyderabad.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే. అటు అధికార తెరాస
By సుభాష్ Published on 27 Nov 2020 6:54 AM GMTజీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే. అటు అధికార తెరాస, ఇటు భాజాపా పార్టీలు రెండు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే నాయకుల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అటు మంత్రి కేటీఆర్ రోడ్డు షోలతో అదరగొడుతూ.. భాజపా నాయకులపై పదునైన విమర్శనాస్త్రాలను సందిస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. నగర వాసులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఆంక్షలున్న ప్రాంతాల్లోకి రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అనిల్ కుమార్ తెలిపారు.
పోలీసు కంట్రోల్ రూము నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్ బీజేఆర్ విగ్రహం చౌరస్తా వైపు అనుమతించరు. కాబట్టి ఏఆర్ పెట్రోలు బంక్, చాపెల్ రోడ్డు వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుంది. అబిడ్స్, గన్‌ఫౌండ్రి నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఎస్‌బీఐ (గన్‌ఫౌండ్రి) నుంచి చాపెల్ రోడ్డువైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి అబిడ్స్ జీపీవో వైపు వచ్చే వారిని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, కింగ్ కోటి రోడ్డువైపు మళ్లిస్తారు.
అలాగే, హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు.